Om Raut | బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఓం రౌత్ ఒకడు. రొటీన్‌కు భిన్నంగా సినిమాలు చేస్తూ బాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన దర్శకత్వం వహించిన ‘ఆదిపురుష్’ విడుదలకు సిద్ధంగాఉంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని టీ సిరీస్ ఫిలింస్, రెట్రోఫైల్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా టీ సిరీస్ అధినేత భూషన్ కుమార్, ఓం రౌత్‌కు 4 కోట్ల ఫెరారీ కారును గిఫ్ట్‌గా ఇచ్చినట్లు గతరాత్రి నుండి వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదట. ఆ కారు ఓంరౌత్ సొంత కారట. నిర్మాత భూషన్ కుమార్, ఓం రౌత్ ఆ కారు దగ్గర ఫోటోలు దిగారు. దాంతో సోషల్ మీడియాలో గిఫ్ట్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. అయితే టీజర్‌కు నెగెటీవ్ టాక్ వచ్చినా.. 24గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. ప్రభాస్‌కు జోడీగా కృతి సనన్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురిగా కనిపించనున్నాడు. దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దాదాపు 15 భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Read Also:
‘NBK107’ థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్.. బాలయ్య కెరీర్లో ఇదే హైయెస్ట్?
Sardar Movie | ‘సర్దార్’లో కార్తి అన్ని గెటప్స్ వేశాడా.. ఏకంగా సూర్యనే దాటేశాడుగా..!
Allu Sirish | అల్లు శిరీష్‌కు ఆ హీరో అంటే చాలా ఇష్టమట..!
Swathi Mutyam | ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘స్వాతిముత్యం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?