Swathi Mutyam | ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘స్వాతిముత్యం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Swathi Mutyam On OTT | టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్‌బాబు చిన్న కొడుకు గణేష్ 'స్వాతిముత్యం' సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ అక్టోబర్ 5న రిలీజైన ఈ చిత్రం మొదటి షో నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది.
Swathi Mutyam On OTT | టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్‌బాబు చిన్న కొడుకు గణేష్ ‘స్వాతిముత్యం’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ అక్టోబర్ 5న రిలీజైన ఈ చిత్రం మొదటి షో నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది. పోటీగా ‘గాడ్‌ఫాదర్’, ‘ది ఘోస్ట్’ చిత్రాలు ఉండటంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం అప్పుడే ఓటీటీలో బాట పట్టింది.
ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 28నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మూవీ థియేటర్ రిలీజ్‌కు నాలుగు వారాల్లోపే ఓటీటీ బాట పట్టింది. ఈ చిత్రంలో గణేష్‌కు జోడీగా వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటించింది. సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ నిర్మించాడు. రావు రమేష్, గోపరాజు రమణ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు. గణేష్ ప్రస్తుతం ‘నేను స్టూడెంట్ సార్’ అనే సినిమాను చేస్తున్నాడు.
Read Also:
‘NBK107’ థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్.. బాలయ్య కెరీర్లో ఇదే హైయెస్ట్?
Allu Sirish | అల్లు శిరీష్‌కు ఆ హీరో అంటే చాలా ఇష్టమట..!
Sardar Movie | ‘సర్దార్’లో కార్తి అన్ని గెటప్స్ వేశాడా.. ఏకంగా సూర్యనే దాటేశాడుగా..!
Brahmastra | అప్పుడే ఓటీటీలోకి ‘బ్రహ్మాస్త్ర’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

