Dhruva Sarja | కన్నడలో సూపర్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్లలో ఒకడు ధృవ సర్జా (Dhruva Sarja). ఇటీవలే మార్టిన్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ టాలెంటెడ్ యాక్టర్ తాజాగా మరో సినిమాతో అందరినీ పలుకరించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సారి మాత్రం హీరోగా కాకుండా నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నాడు. ధృవ సర్జా సమర్పిస్తున్న తాజా ప్రాజెక్ట్ కోర.
యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ మూవీలో సునామీ కిట్టి, చరిష్మా, పి మూర్తి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. హీరో ముఖంపై గాట్లతో సీరియస్‌గా కనిపిస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు. ఒరటాశ్రీ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ మరియు రత్నమ్మ మూవీస్ పతాకాలపై డాక్టర్ ఎబి నందిని, ఎఎన్ బాలాజీ, పి మూర్తి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ మూవీలో ఎంకే మాత, మునిరాజు, నీనాసం అశ్వత్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బిఆర్ హేమంత్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Sandeham | ఓటీటీలో హెబ్బా పటేల్ ఫీవర్.. ట్రెండింగ్‌లో సందేహం
Trisha | గెట్ రెడీ.. డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్న త్రిష
Bloody Beggar | బ్లడీ బెగ్గర్ ఓటీటీలోకి వచ్చేశాడు.. కవిన్ సందడి చేసే పాపులర్ ప్లాట్‌ఫాం ఇదే