ధనుష్ (Dhanush), సంయుక్తామీనన్ కాంబోలో వస్తున్న తాజా ప్రాజెక్ట్ సార్ (Sir). తెలుగు, తమిళ భాషల్లో వస్తుండగా.. తమిళంలో వాథి (Vaathi) అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది. టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.
కాగా ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. 2023 ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేసిన మాస్టారు మాస్టారు పాట సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటోంది.
సార్ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్-ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశి-సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో డైలాగ్ కింగ్ సాయికుమార్ విలన్‌గా నటిస్తున్నాడు. సీనియర్ నటుడు తనికెళ్లభరణి కీలక పాత్ర పోషిస్తున్నారు. ధనుష్ తెలుగులో నటిస్తోన్న స్ట్రెయిట్ సినిమా ఇదే కావడం విశేషం.
తెలుగు, తమిళ పోస్టర్స్‌తో రిలీజ్ డేట్..
#Vaathi / #SIR Movie going to hit the theaters on 17 Feb 2023 ♥️#VaathiOn17Feb / #SIROn17Feb@dhanushkraja #VenkyAtluri @iamsamyuktha_ @gvprakash @dopyuvraj @NavinNooli @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/hP72BTh5RZ
— BA Raju's Team (@baraju_SuperHit) November 17, 2022
Read Also :Driver Jamuna | డ్రైవర్ జమున విడుదల వాయిదా.. ఇంతకీ కారణమేంటో?