Dhanush | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతి కొద్ది మంది కోలీవుడ్ స్టార్ యాక్టర్లలో ఒకరు ధనుష్ (Dhanush). క్లాస్, మాస్ హీరోగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఈ స్టార్ యాక్టర్ ఇటీవలే డైరెక్టర్ కమ్ హీరోగా తెరకెక్కించిన రాయన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ధనుష్ మరోసారి డైరెక్టర్ క్యాప్ పెట్టుకోబోతున్నాడన్న వార్త ఒకటి లైమ్ లైట్లోకి వచ్చింది. తమిళ నటుడు అరుణ్ విజయ్ (Arun Vijay) లీడ్ రోల్లో నటించనున్న సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.
అరుణ్ విజయ్‌తో సినిమా డిస్కషన్ తుది దశలో ఉందని.. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ ఇద్దరి కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఉండబోతుందని కోలీవుడ్ సర్కిల్ టాక్. అంతేకాదు ఈ చిత్రంలో ధనుష్ కీలక పాత్రలో కనిపించనున్నాడట. అరుణ్ విజయ్ నటిస్తోన్న Vanangaan
త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఇదే నిజమైతే ధనుష్ సినిమా అరుణ్ విజయ్ కెరీర్లో వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ సినిమాగా నిలువడం ఖాయమని సినీ జనాలు చర్చించుకుంటున్నారు. ధనుష్ నెక్ట్స్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తోన్న కుబేర సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఇప్పటికే విడుదల చేసిన కుబేర పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ అమాంతం పెంచుతూ.. సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రష్మిక పాత్ర ఎలా ఉండబోతుందో గ్లింప్స్ వీడియోతో క్లారిటీ ఇచ్చేశాడు శేఖర్ కమ్ముల. కుబేరలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి కుబేర సినిమా పూర్తయితే ధనుష్ తన నెక్ట్స్ డైరెక్టోరియల్ వెంచర్‌పై ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
Kanchana 4 | రాఘవా లారెన్స్ కాంచన 4 స్క్రిప్ట్ ఫైనల్.. పూర్తి వివరాలివే..!
Hema | నేను డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం : హేమ
Mr Bachchan | రవితేజ మిస్టర్ బచ్చన్ ఓటీటీ ఎంట్రీ.. ఇంతకీ ఎన్ని భాషల్లోనంటే..?
Hema | హేమ డ్రగ్స్ తీసుకుంది.. బెంగళూరు రేవ్ పార్టీ కేసు చార్జీషీట్లో పోలీసులు