Devara | ఆర్ఆర్ఆర్తో గ్లోబల్ స్టార్డమ్ సంపాదించిన జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ రోల్ పోషించిన చిత్రం దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) డైరెక్ట్ చేసిన ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
దేవర నవంబర్ 8 నుంచి ఓటీటీలో సందడి చేస్తోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, మలయాళం కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం దేవర సినిమాను పలు విదేశీ భాషల్లో స్ట్రీమింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంగ్లీష్, కొరియన్, స్పానిష్, బ్రెజిలియన్, పోర్చుగీస్ భాషల్లో సందడి చేస్తోంది. మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులకు సర్ప్రైజ్ అనే చెప్పాలి.
మేకర్స్ తీసుకున్న ఈ డెసిషన్‌తో సినిమా అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులకు చేరడంలో కీ రోల్ పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దేవర హిందీ వెర్షన్ మాత్రం ఇప్పటికీ అందుబాటులో లేకపోవడం అభిమానులకు నిరాశ కలిగించే విషయం. మేకర్స్ గ్లోబల్ స్టార్ అభిమానుల కోసం హిందీ వెర్షన్‌ను కూడా వీక్షించే వెసులు బాటు కల్పిస్తారా..? అనేది చూడాలి మరి.
ఈ చిత్రలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటించగా.. ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కించారు.
Bhairavam | భైరవం షూటింగ్ టైం.. కోనసీమలో అదితీశంకర్తో బెల్లంకొండ శ్రీనివాస్
UI The Movie | ఉపేంద్ర యూఐ తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తుందెవరో తెలుసా..?
Dhanush | 2025 ఫస్ట్ హాఫ్‌ను టేకోవర్ చేసిన ధనుష్.. కుబేర సహా 3 సినిమాలు
Mammootty | మాలీవుడ్ మల్టీస్టారర్ కోసం శ్రీలంకలో మమ్ముట్టి, మోహన్ లాల్.. ఫొటోలు వైరల్
Theatre Reviews | ఇకపై థియేటర్ల ముందు రివ్యూలకు నో ఛాన్స్.. !