Devadasu Movie | దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన క్లాసిక్ సినిమాలలో ఒకటి దేవదాసు. ఈ సినిమా విడుదలై నేటికి 72 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్పెషల్ వీడియోను పంచుకుంది అన్నపూర్ణ స్టూడియోస్.
శరత్ చంద్ర చటర్జీ రచించిన దేవ్దాస్ నవల ఆధారంగా వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1953, జూన్ 26న విడుదలైంది. అక్కినేని నాగేశ్వరరావు నటన, సావిత్రి, లలిత పాత్రలు, ఘంటసాల సంగీతంతో తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఇది తెలుగు ప్రేక్షకులకు ఎంతో నచ్చిన సినిమా, అక్కినేని నాగేశ్వరరావు కెరీర్ లోనే అత్యంత అపురూపమైన పాత్రల్లో ఇది ఒకటి. భగ్న ప్రేమికులకు “దేవదాసు” అనే పదం తెలుగు సాహిత్యంలో భాగమైపోయింది.
Read More