టాలీవుడ్ యాక్టర్ బాలకృష్ణ (Balakrishna) , బోయపాటి శ్రీను (Boyapati Srinu) డైరెక్షన్ లో చేస్తున్న చిత్రం అఖండ (Akhanda). వీరిద్దరి కాంబోలో వస్తున్న మూడో చిత్రమిది. యాక్షన్ డ్రామాగా రాబోతున్న అఖండకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ తెరపైకి వచ్చింది. బాలకృష్ణ టాకీ పార్టును పూర్తి చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో ఉన్న మేకర్స్ త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటిస్తారని ఫిలింనగర్ సర్కిల్ టాక్.
ఈ చిత్రంలో క్లైమాక్స్ సీన్లు గూస్బంప్స్ తెప్పించేలా ఉండటమే కాకుండా బాలకృష్ణను ఇదివరకెన్నడూ చూడనట్వంటి పాత్రలో చూస్తారట. స్టంట్ సిల్వ నేతృత్వంలో బాలకృష్ణ క్రేజీ స్టంట్స్ చేశాడని సమాచారం. క్లైమాక్స్ ఎమోషనల్ అండ్ మాస్ కోణంలో సాగుతుందని తెలుస్తోంది. బోయపాటి శ్రీను హీరో బాలకృష్ణ ను అభిమానులు ఎప్పుడూ చూడని విధంగా చూపించి..అభిమానులకు విజువల్ ఫీస్టునందించడం ఖాయమంటున్నారు సినీ జనాలు.
అఖండలో జగపతిబాబు, శ్రీకాంత్ కీ రోల్స్ చేస్తుండగా..ప్రగ్యాజైశ్వాల్, పూర్ణ ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్. సింహా, లెజెండ్ తర్వాత బోయపాటి-బాలకృష్ణ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీగానే అంచనాలు నెలకొన్నాయి.
ఇవి కూడా చదవండి..
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Nayanthara Engagement| ఎంగేజ్మెంట్ అయిపోందని చెప్పిన నయనతార
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్