Raj kandukuri | హార్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాలకు టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంటుందని తెలిసిందే. ఇదే కోవలో ప్రేక్షకులకు ఓ వైపు థ్రిల్‌ను, మరోవైపు భయాన్ని చూపించేందుకు వస్తోంది. రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీతోపాటు పలు సినిమాల్లో నటించిన ఈ భామ బోల్డ్ కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తుంటుంది. గాయత్రి గుప్తా కీలక పాత్రలో నటించిన చిత్రం భవానీ వార్డ్ 1997.
ఫిబ్రవరి 7న విడుదలవుతున్న నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. సస్పెన్స్, థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో సాగుతున్న ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ప్రమోషనల్ ఈవెంట్లో నిర్మాత రాజ్‌కందుకూరి మాట్లాడుతూ..ఇప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలే ఇప్పుడు ఆడుతున్నాయి. ఈ చిత్రంలో కంటెంట్ ఉందని నమ్ముతున్నా. నాకు హార్రర్ సినిమాలంటే చాలా ఇష్టం. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.
గణేశ్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీశ్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి నటిస్తున్నారు. జీడీ నరసింహా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని జీడీఆర్ మోషన్ పిక్చర్, విభూ మీడియా సమర్పణలో చంద్రకాంత సోలంకి, జీడీ నరిసింహా తెరకెక్కించారు.
నాకు హారర్ మూవీస్ అంటే ఇష్టం కంటెంట్.. బాగున్నా కూడా బై ఆఫ్టర్ నూన్ మీ మూవీ పిక్ అప్ అయిపోతుంది .. మీ సినిమా లో కంటెంట్ ఉంటుంది అనుకుంటున్నా – ప్రొడ్యూసర్ @IamRajKandukuri గారు#RajKandukuri #BhavaniWard1997 pic.twitter.com/QD3kKtWxBk
— SR Promotions (@SR_Promotions) February 4, 2025
Pushpa 2 The Rule | పుష్పరాజ్ మేనియా కంటిన్యూ.. ఇక మరో భాషలో అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్..!
Fauji | ప్రభాస్ ఫౌజీ లాంగ్ షెడ్యూల్ ప్లాన్.. షూటింగ్ ప్లేస్ ఇదేనట..!
Thandel | తండేల్కు నాగచైతన్య, సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్స్.. ఎంతో తెలుసా..?