OPEN AI CEO Sam Altman | చాట్‌జీపీటీ సృష్టికర్త.. ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఈ ఏడాది చివర్లో ఇండియాలో తమ మొదటి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వచ్చే నెలలో భారత్‌కి రాబోతున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా శామ్ ఆల్ట్‌మన్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెడుతూ.. ఇండియాలో కృత్రిమ మేధస్సు (AI) వాడకం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. గత సంవత్సరం నుంచి చాట్‌జీపీటీ వినియోగదారుల సంఖ్య ఏకంగా నాలుగు రెట్లు పెరిగిందని తెలిపారు. ఇందులో భాగంగానే ఇండియాలో మరింత పెట్టుబడి పెట్టడానికి మేము మరింత ఉత్సాహంగా ఉన్నట్లు శామ్ రాసుకోచ్చాడు. అయితే శామ్ పోస్ట్‌పై తాజాగా మాజీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఎక్స్ వేదికంగా స్పందించాడు.
ఇండియాలో తమ మొదటి కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌కి.. హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని మాజీ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వచ్చే నెల భారత్ పర్యటనకు రానున్న శామ్ ఆల్ట్‌మన్‌కు హైదరాబాద్ నగరానికి స్వాగతం పలికారు కేటీఆర్. హైదరాబాద్ ఇండియాకు సరైన ప్రవేశ ద్వారంగా, మరియు ఓపెన్ ఏఐ వంటి సంస్థలకు అనువైన కేంద్రంగా అభివర్ణించారు.
హైదరాబాద్ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన ఇన్నోవేషన్ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉందని. ఇక్కడ టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, మరియు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ వంటి సంస్థలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ఈ వాతావరణం ఓపెన్ ఏఐ కార్యకలాపాలకు ఎంతో అనుకూలంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Welcome to India, @sama! 👋
Hyderabad is the perfect gateway to India and an ideal base for OpenAI
This city offers India’s most vibrant innovation ecosystem – THub, WEHub, TWorks, Telangana State Innovation Cell, Research and Innovation Circle of Hyderabad
It’s the preferred… https://t.co/eXkXE2xkeg
— KTR (@KTRBRS) August 23, 2025