Telangana Assembly | హైదరాబాద్ : రెండో రోజు సమావేశమైన తెలంగాణ శాసనసభలో పలు బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు, అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్లుకు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ బిల్లుకు, ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.
అనంతరం శాసనసభ వాయిదా పడింది. మళ్లీ తిరిగి సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుంది. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టును చదివి వినిపించనున్నారు. అనంతరం ఈ అంశంపై మాట్లాడేందుకు సభాపతి సభ్యులందరికీ అవకాశం ఇవ్వనున్నారు. రాత్రి వరకు చర్చ జరిగే అవకాశం ఉంది.