Rinku Singh : టీమిండియా స్టార్ రింకూ సింగ్ (Rinku Singh) ఆసియా కప్ ముందు విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. మెగా టోర్నీలో తాను జట్టుకు ఫినిషర్‌గా ఎంతగా పనికొస్తానో చాటుతూ యూపీ టీ20 లీగ్‌లో బౌండరీల మోత మోగించాడు. తనదైన మెరుపు షాట్లతో అలరిస్తూ అర్ధ శతకంతో చెలరేగాడీ హిట్టర్. మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఆదుకున్న అతడు.. ఆకాశమే హద్దుగా విరుచుకుపడి ఒంటిచేత్తో గెలిపించాడు. రింకూ సుడిగాలి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉండడం విశేషం.
ఐపీఎల్‌తో పవర్ హిట్టర్ ట్యాగ్ సొంతం చేసుకున్న రింకూ సింగ్ యూపీ టీ20లో రెచ్చిపోయాడు. మీరుట్ మ్యావెరిక్ (Meerut Mavericks) జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రింకూ తనదైన స్టయిల్లో చెలరేగి కాశీ రుద్రాస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 136 పరుగుల ఛేదనలో 26కే మూడు వికెట్లు పడిన వేళలో క్రీజులోకి వచ్చిన ఈ లెఫ్ట్ హ్యాండర్ వీరకొట్టుడు కొట్టాడు. తొలి 20 బంతుల్లో ఏడు రన్స్ చేసిన రింకూ ఆ తర్వాత గేర్ మార్చాడు.
𝙍𝙞𝙣𝙠𝙪’𝙨 𝙍𝙖𝙢𝙥𝙖𝙜𝙚 in Ekana tonight! 78* off 48.
Watch live on SonyLIV and Sony Sports Network. #UPT20League #ANAXUPT20League #KhiladiYahanBantaHai #KRvsMM pic.twitter.com/Xcl0xyvQbp
— UP T20 League (@t20uttarpradesh) August 30, 2025
స్వీప్ షాట్లు, ఆఫ్ సైడ్ బౌండరీలతో అలరించి అర్ధ శతకం సాధించాడు. ఆ తర్వాత కూడా అదే దూకుడు కొనసాగించి కేవలం 48 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 78 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడీ ఫినిషర్. అటల్ బిహారీ బౌలింగ్‌లో వరుసగా 6, 4, 6, 6 కొట్టడం మ్యాచ్‌కే హైలెట్. రింకూ విధ్వంసంతో మీరుట్ మ్యావెరిక్ 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ఒక్క మ్యాచ్ అనేకాదు.. ఈ లీగ్‌లో రింకూ ధనాధన్ ఇన్నింగ్స్‌లతో హడలెత్తిస్తున్నాడు. ఇప్పటివరకూ ఏడు మ్యాచుల్లో ఈ స్టార్ బ్యాటర్ 107.52 స్ట్రయిక్ రేటుతో 295 రన్స్ సాధించాడు.