Nivetha Pethuraj | టాలీవుడ్ బ్యూటీ నివేదా పేతురాజ్ రీసెంట్గా తన ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని, దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త రజిత్ ఇబ్రాన్‌తో రిలేషన్లో ఉన్నానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ ప్రకటనా అనంతరం సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే నివేదా తాజాగా తన ప్రేమాయణంకి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఐదేళ్ల క్రితం దుబాయ్‌లో నిర్వహించిన ఓ రేసింగ్ ఈవెంట్లో రజిత్‌ను మొదటిసారి కలిశాను. మొదట మేము మంచి స్నేహితులుగా ప్రారంభించాము. ఆపై సమయం గడుస్తూ అభిప్రాయాలు కలవడం, మనసులు దగ్గర కావడంతో ప్రేమలో పడిపోయాము.
మా రిలేషన్ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఇండస్ట్రీలో కూడా ఈ విషయం ఎవరికీ తెలియదు. ఇప్పుడు అకస్మాత్తుగా ఈ విషయాన్ని బయటపెట్టడంతో నా మేనేజర్ కూడా షాక్ అయ్యాడు అని చెప్పింది. ఈ ఏడాది అక్టోబర్‌లో మేం ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాం. పెళ్లి జనవరిలో ప్లాన్ చేస్తున్నాం. తుది తేదీ ఇంకా ఫిక్స్ కాలేదు కానీ, పెళ్లి పనులు మొదలుపెట్టేశాం. మా ఇరు కుటుంబాలు ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాయి. మేము సింపుల్‌గా, కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లిని జరుపుకుంటాం అని నివేదా వివరించింది.
మధురైలో జన్మించి పెరిగిన నివేదా, ‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టింది. అనంతరం ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారేవరురా’, ‘అల వైకుంఠపురములో’, ‘రెడ్’, ‘పాగల్’, ‘విరాటపర్వం’, ‘దాస్ కా ధమ్కీ’ వంటి సినిమాల్లో నటించింది. సినిమాల పరంగా టాలెంట్ ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆమె చేతిలో కొత్త ప్రాజెక్టులు లేనట్లు తెలుస్తోంది. కార్ రేసింగ్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లోనూ ఆమె ప్రత్యేక ఆసక్తి కలిగి ఉంది. ఇకపై ఆమె వ్యక్తిగత జీవితం కొత్త అధ్యాయానికి తెరలేవనుంది. పెళ్లి తర్వాత నివేదా సినిమాలు చేస్తుందా లేదా అనేది చూడాలి.