Singur back water | జహీరాబాద్, ఆగస్టు 31 : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని హుస్సేన్ నగర్, చీకుర్తి, అమీరాబాద్, కాకి జన్వాడ, రాఘవపూర్, ముర్తుజాపూర్ గ్రామ శివారులో సింగూర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ పంట పొలాల్లోకి భారీగా వచ్చి చేరుతుంది. మంజీరా నదికి ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సింగూర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో బ్యాక్ వాటర్ ఆయా గ్రామాల శివారుల్లోని పంటపొలాల్లోకి చేరుతోంది.
తద్వారా సాగులో ఉన్న పంటలు ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీగా బ్యాక్ వాటర్ పంటపొలాల్లోకి రావడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా గ్రామాల పరిధిలో దాదాపు 500 పైగా ఎకరాల్లో పత్తి, సోయాబీన్, మినుము, పెసర తదితర పంటలు బ్యాక్ వాటర్లో మునిగి నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ బ్యాక్ వాటర్ రావడంతో విష సర్పాలు గ్రామాల్లోకి వచ్చే అవకాశం ఉందని మరోవైపు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు పంట పొలాలను పరిశీలించి తమను ఆదుకోవాలని ఆయా గ్రామాల రైతులు ప్రజలు కోరుతున్నారు.
Ear Wax Cleaning | చెవుల్లో ఉండే గులిమిని తొలగించేందుకు ఈ సహజసిద్ధమైన చిట్కాలను పాటించండి..!
Rahul portrait burnt | కాంగ్రెస్ ఆటలు సాగడం లేదని అపనిందలు.. రాహూల్ గాంధీ చిత్రపటం దహనం
Free mega medical camp | కోటగిరి లో ఉచిత మెగా వైద్య శిబిరం.. ప్రజల నుంచి విశేష స్పందన