Tadipatri | అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుతో ఘర్షణలు చెలరేగాయి. గణేశ్ శోభాయాత్రలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ వర్గీయులు రాళ్లు రువ్వుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఆదివారం నాడు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ అనుచరులు వేర్వేరుగా వినాయక శోభాయాత్ర నిర్వహించారు. ఊరేగింపు తీస్తుండగా అశోక్ పిల్లర్ వద్ద ఇరువర్గాలు ఎదురెదురు పడ్డాయి. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. మితిమీరి ఒకరిపైఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఇరువర్గాల ఘర్షణలో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ అనుచరుల మధ్య ఘర్షణల గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున మోహరించి ఇరువర్గాలను చెదరగొట్టారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Fissures in Anantapur unit of the #TDP as Clashes erupted during Vinayaka immersion between supporters of JC Prabhakar Reddy & rival Kakarla Ranganath in Tadipatri. Stone-pelting, vehicle damage & slogans of shouting shook the town. Heavy police deployed. Situation tense.… pic.twitter.com/Jx1543R56s
— Ashish (@KP_Aashish) August 31, 2025
కాగా, కాకర్ల రంగనాథ్ గతంలో వైసీపీలో ఉండేవారు. అయితే సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఎన్నికల తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంనాథ్ వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఆధిపత్యం కోసం ఇరువర్గాలు తాపత్రయపడుతున్నాయి.