Rambal Naik | లేని అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి కులాల మధ్య, జాతుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ సోయం బాపూరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు (భద్రాచలం) తమ పనికిమాలిన ప్రయత్నాలను మానుకోవాలని, లంబాడి జాతి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడవత్ రాంబల్ నాయక్ డిమాండ్ చేశారు.
సోయం బాపూరావు, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారని, దీని వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా? అనుమానం కలుగుతున్నదని.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సీతక్క ప్రమేయం ఉన్నట్లు సమాచారం అందుతుందన్నారు. ఒకవేళ మీ ప్రమేయం లేదని నిరూపించుకోవాలి అంటే ఆ ఇద్దరిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. లేదంటే మీ పాత్ర వారి వెనుక ఉన్నట్టు లంబాడి ప్రజలు కనుక్కోవాల్సిన అవసరం ఉందని తెలియజేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులపైనే ఉందని, లేక వీరిద్దరూ ఏమైనా జాతుల మధ్యలో విభేదాలు సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారా..? అని తేల్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులపైనే ఉందన్నారు. ఒకవేళ ఈ అంశం కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా ఉంటే జాతుల మధ్య విభేదాలు సృష్టించాలనుకునే వీరిద్దరిని కాంగ్రెస్ పార్టీలో నుండి వెంటనే సస్పెండ్ చేయాలని రాంబల్ నాయక్ డిమాండ్ చేశారు.
తగిన బుద్ధి చెప్పాల్సిందే..
స్వార్థపరమైన రాజకీయాల కోసం జాతుల మధ్యలో చిచ్చుపెట్టే ఇలాంటి నాయకులకు తగిన బుద్ధి చెప్పాల్సిందేనని, ఇలాంటి నాయకులపై జాతీయ పార్టీలు క్రమశిక్షణ చర్యలు తీసుకోకుంటే లంబాడా, బంజారా, సుగాలి జాతులన్నీ ఒక్కటై వీరిద్దరికి, వీరికి సపోర్టు చేస్తున్న రెండు జాతీయ పార్టీలకు కూడా తగిన సమయంలో తగిన బుద్ధి చెబుతాయని హెచ్చరించారు. ఎన్నో సంవత్సరాలుగా ఎస్టీలలో కొనసాగుతున్న బంజారా, లంబాడా, సుగాలి జాతులను బీసీలుగా మార్చే ప్రయత్నం చేస్తున్న ఈ ఇద్దరు నాయకుల వ్యవహారశైలిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందేనన్నారు.
ఒకవైపు దేశంలోని బంజారా జాతుల ప్రజలు అంతా కలిసి లంబాడ భాషకు ఒక పూర్వ రూపం కల్పించాలని.. రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చేర్చాలని ప్రయత్నం చేస్తుంటే, ఇలా లంబాడి తెగలను తీసుకువచ్చి బీసీలలో కలపాలని ప్రయత్నాలు చేయడం ఎంతవరకు సమంజసమో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్ణయించుకోవాలని రాంబల్ నాయక్ అన్నారు. అసలు ఈ అంశం మీ ఇద్దరికీ సంబంధించినదేనా..? లేక వీరి వెనకాల వైపు ఉండి ఎవరైనా ఈ తతంగం నడిపిస్తున్నారా? ఎవరి రాజకీయ స్వార్థం కోసం ఇలాంటి పనులు చేస్తున్నారో తెలియాల్సిన అవసరం ఉందని, వీరి వెనుక ఉండి ఈ తతంగాన్ని నడిపిస్తున్న నాయకులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం జాతీయ పార్టీ నాయకులకే ఉందని అన్నారు.
నిజంగా బంజారా, లంబాడ, సుగాలి జాతుల ప్రజలపై జాతీయ పార్టీ నాయకులకు ప్రేమ ఉంటే, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న సోయం బాబూరావు, తెల్లం వెంకట్రావులను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని రాంబల్ నాయక్ డిమాండ్ చేశారు. ఇలాంటి కుట్రపూరితమైన చర్యలను వీరు మానుకోకుంటే రాష్ట్ర ఉన్న 40 లక్షల మంది లంబాడి జాతి వారందరం ఒక్కటై వీరికి తగిన బుద్ధి చెబుతామని మూడవత్ రాంబల్ నాయక్ హెచ్చరించారు.
Ear Wax Cleaning | చెవుల్లో ఉండే గులిమిని తొలగించేందుకు ఈ సహజసిద్ధమైన చిట్కాలను పాటించండి..!
Rahul portrait burnt | కాంగ్రెస్ ఆటలు సాగడం లేదని అపనిందలు.. రాహూల్ గాంధీ చిత్రపటం దహనం
Free mega medical camp | కోటగిరి లో ఉచిత మెగా వైద్య శిబిరం.. ప్రజల నుంచి విశేష స్పందన