తాండూర్ : దేశ ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi ) తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తాండూర్ మండల కేంద్రం ఐబీ సెంటర్ లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం ( Effigy burnt ) చేసి నిరసన చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రధానికి ఆయా దేశ అధ్యక్షులు ప్రజలు నీరాజనం పడుతుంటే రాహుల్ గాంధీ దేశ ప్రధానిపై వారి తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
బహిరంగ క్షమాపణ చెప్పక పోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు దూడపాక భరత్ కుమార్, జిల్లా కార్యదర్శి రామగోని మహీధర్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు, సీనియర్ నాయకులు చిలువేరు శేషగిరి, పులగం తిరుపతి, మండల ప్రధాన కార్యదర్శి పుట్ట కుమార్, మండల కోశాధికారి రాచర్ల సురేష్, సీనియర్ నాయకులు సిద్ధం మల్లేష్, ఆవుల చందు, తదితరులు పాల్గొన్నారు.