టాలీవుడ్ లో రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఆచార్య (Acharya) . మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ ( Koratala Siva) దర్శకుడు. రాంచరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. రెండు పాటలు మినహా ఆచార్య షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని బీఏ రాజు టీం ట్విటర్ ద్వారా తెలియజేసింది. ఫారెస్ట్ లొకేషన్ లో చిరంజీవి, రాంచరణ్ పక్కపక్కనే కూర్చున్న స్టిల్ ను షేర్ చేశారు. అడవిలో వాగు అంచు పక్కనే ఓ చెట్టు కింద రాయిపై కామ్రేడ్ గెటప్స్ లో చిరు, చరణ్ కూర్చున్న స్టిల్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చిరంజీవిపై ఓ పాట, రాంచరణ్, పూజాహెగ్డేపై మరో పాట చిత్రీకరించాల్సి ఉండగా..ఈ నెలలో షూట్ చేయనున్నారు కొరటాల అండ్ టీం. నక్సలిజం బ్యాక్ డ్రాప్ అంశాలు, ఇతర విషయాల చుట్టూ తిరిగే స్టోరీతో ఆచార్య తెరకెక్కుతోంది. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో ఇప్పటికే విడుదలైన లాహే లాహే పాటకు మిలియన్ల సంఖ్యలో వ్యూస్ తో అద్భుతమైన స్పందన వచ్చింది. సోనూసూద్, పోసాని కృష్ణమురళి, తనికెళ్లభరణి, సంగీత, కిశోర్, రెజీనా కసాండ్రా (స్పెషల్ సాంగ్) ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Talkie of the most awaited film #Acharya has been completed. Shooting of two songs is yet to be completed.
— BA Raju's Team (@baraju_SuperHit) August 4, 2021
Megastar @KChiruTweets @AlwaysRamCharan #KoratalaSiva @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @DOP_Tirru @NavinNooli @sureshsrajan #NiranjanReddy @MatineeEnt @KonidelaPro pic.twitter.com/ZfW0WXFWLs
ఇవి కూడా చదవండి..
Friday New Movies | శుక్రవారం సందడి..ఆగస్ట్ 6న 7 సినిమాలు రిలీజ్
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Karan Johar Fear| భయపడుతున్న బాలీవుడ్ దర్శకుడు