Parineeti Chopra | బాలీవుడ్ స్టార్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra) , ఆప్ ఎంపీ (AAP MP) రాఘవ్ చద్దా (Raghav Chadha) ఎంగేజ్మెంట్ (Engagement) శనివారం జరగనుంది. ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో ఉన్న కపుర్తాలా హౌస్ (Kapurthala House)లో వీరి నిశ్చితార్థం జరగనుంది. నిశ్చితార్థానికి పరిణీతి – రాఘవ్ చద్దా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, సెలబ్రిటీలు హాజరుకానున్నారు. మొత్తం 150 మంది అతిథులు ఈ వేడుకలో పాల్గొని కొత్త జంటను ఆశీర్వదించనున్నారు.
మరోవైపు వేడుకకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత వేడుకలు ప్రారంభమవుతాయి. సిక్కు సంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమం జరగనున్నట్లు సమాచారం. ముందుగా ప్రత్యేక ప్రార్థనలు (ardas or prayer) నిర్వహించనున్నారని.. అనంతరం ఇరు కుటుంబ సభ్యులు, అతిథుల సమక్షంలో ఈ ప్రేమ జంట ఉంగరాలు మార్చుకోనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Priyanka Chopra
కాగా, పలువురు సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు ఢిల్లీ చేరుకుంటున్నారు. పరిణీతి సోదరి ప్రియాంక చోప్రా (Priyanka Chopra).. అమెరికా నుంచి భారత్ వచ్చారు. ఈ ఉదయం ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. తాజాగా ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర (Manish Malhotra) కూడా ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. సినీ ప్రముఖులతోపాటు రాజకీయ నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ సహా పలువురు ఆప్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.
Manish Malhotra 1
మరోవైపు ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్స్ శుక్రవారం నుంచే ప్రారంభమయ్యాయి. ఈ ప్రేమ జంట కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం నిన్న రాత్రి ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసినట్లు వీరిద్దరికీ దగ్గర వ్యక్తులు తెలిపారు. మరోవైపు కార్యక్రమానికి హాజరయ్యే అతిథుల కోసం ప్రత్యేకంగా లంచ్, డిన్నర్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. పలు రకాల వంటకాలు అతిథులకు వడ్డించనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ చివర్లో వీరు వివాహం చేసుకునే అవకాశం ఉంది.
Also Read..
Karnataka Assembly Election Results 2023 | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్
Karnataka Elections: కర్ణాటక ఎన్నికల చరిత్రలోనే అత్యంత వయోవృద్ధుడు.. 92ఏళ్ల వయసులో అసెంబ్లీకి
Karnataka Assembly: రోడ్షోలకే మోదీ గ్లామర్.. ఓట్ షేర్లో దూసుకెళ్లిన కాంగ్రెస్