Karnataka Elections: కర్ణాటక ఎన్నికల చరిత్రలోనే అత్యంత వయోవృద్ధుడు.. 92ఏళ్ల వయసులో అసెంబ్లీకి
కర్ణాటక ఎన్నికల చరిత్రలోనే అత్యంత వయోవృద్ధుడైన శివశంకరప్ప మరోసారి జయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ నేత అయిన 92ఏళ్ల శివశంకరప్ప దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి వరసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
కర్ణాటక ఎన్నికల చరిత్రలోనే అత్యంత వయోవృద్ధుడైన శివశంకరప్ప మరోసారి జయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ నేత అయిన 92ఏళ్ల శివశంకరప్ప దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి వరసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసిన వయోవృద్ధుడిగా రికార్డు సృష్టించారు.
శామనూరు శివశంకరప్ప 1994లో రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. అదే సంవత్సరంలో దావణగెరె నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన 2004లో మరోసారి దావణగెరె నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2008 నుంచి దావణగెరె దక్షిణ నుంచి పోటీ చేస్తున్న శివశంకరప్ప 2013, 2018, 2023లో వరసగా నాలుగోసారి గెలుపొందారు. మొత్తంగా దావణగెరె నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
ఈ ఎన్నికల్లో శంకరప్పకు పోటీగా బీజీపీ బీజీ అజయ్‌కుమార్‌ను నిలబెట్టింది. ఈ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న ముస్లింలకు అజయ్‌కుమార్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. బీజేపీ విజయం సాధించడం ఖాయమనుకున్నారు. కానీ దావణగెరె నియోజకవర్గ ప్రజలు మరోసారి శివశంకరప్పకే పట్టం కట్టారు. దీంతో జీజేపీ వ్యూహం బెడిసికొట్టింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

