Deva | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని భామ పూజా హెగ్డే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగిన ఈ భామ 2024ను మాత్రం జీరో ఇయర్‌గా ముగించేసింది. చాలా కాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టింది. వీటిలో ఒకటి హిందీ సినిమా దేవా (Deva). బాలీవుడ్ యాక్టర్ షాహిద్ కపూర్ (Shahid Kapoor) టైటిల్ రోల్లో నటిస్తున్నాడు.
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ దేవా సినిమా స్పూర్తితో వస్తోన్న ఈ మూవీకి మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రోస్ దర్శకత్వం వహిస్తున్నాడు. పూజాహెగ్డే (Pooja Hegde) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.ఈ చిత్రం జనవరి 31న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే ఇందులో షాహిద్ కపూర్-పూజాహెగ్డే సన్నిహిత సన్నివేశంపై సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపినట్టు బీటౌన్ సర్కిల్ టాక్.
తాజా టాక్ ప్రకారం సెన్సార్ బోర్డు ఈ సీన్ నుంచి 6 సెకన్లు ట్రిమ్ చేయాలని సూచించిందట. దేవాతో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇవ్వాలనుకుంటున్న పూజాహెగ్డేకు మరి ఈ సినిమా ఎలా కలిసి వస్తుందో చూడాలంటున్నారు సినీ జనాలు.
రాయ్ కపూర్ ఫిలిమ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పావేల్ గులాటి, ప్రవేశ్ రాణా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షాహిద్ కపూర్ ఈ చిత్రంలో రూత్‌లెస్ పోలీస్‌గా అలరించబోతున్నట్లు ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్.
Vaishnavi Chaitanya | జిమ్ సెషన్లో బేబి హీరోయిన్ వైష్ణవి చైతన్య.. వర్కవుట్స్‌తో బిజీబిజీ
VD14 | రిపబ్లిక్ డే స్పెషల్.. కీ అప్డేట్ షేర్ చేసిన విజయ్ దేవరకొండ టీం
Shafi | పది రోజులుగా వెంటిలేటర్‌పై.. ప్రముఖ దర్శకుడు షఫీ మృతి