Jabardasth | తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క కామెడీ షో నుంచి ఎంతో మంది నటులు ఇండస్ట్రీకి వచ్చారు. ఈరోజు వాళ్లు ఉన్నత స్థితిలో ఉన్నారు అంటే దానికి కారణం మల్లెమాల స్థాపించిన జబర్దస్త్ కామెడీ షో. అంతేకాదు రోజా, నాగబాబు లాంటి వాళ్లకు కూడా కెరీర్ డైలమాలో ఉన్నప్పుడు ఊపిరి ఊదింది ఈ కామెడీ షో. ఇక అనసూయ, రష్మి గౌతమ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్న వాళ్లకు తగిన గుర్తింపు రాలేదు. అలాంటి వాళ్లకు జబర్దస్త్ కామెడీ షో ప్రత్యేక గుర్తింపు తీసుకు రావడమే కాకుండా.. ఈ రోజు ఇండస్ట్రీలో స్టార్స్ అనే హోదా కల్పించింది.
సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మంచి మంచి కమెడియన్స్ ను తెలుగు ఇండస్ట్రీకి అందించింది జబర్దస్త్ కామెడీ షో. టీఆర్పీ రేటింగ్స్ పరంగా చూసుకున్నా కూడా రికార్డులు తిరగరాసింది. ఒకప్పుడు ఏకంగా 14 వరకు రేటింగ్స్ వచ్చిన రోజులు ఉన్నాయి. ఒక కామెడీ షోకు.. అందులోనూ ఒక రియాలిటీ షోకు ఇంత రేటింగ్ వస్తుందా అని అప్పట్లో అందరూ నోరెళ్లబెట్టారు. దీన్ని చూసి మిగిలిన ఛానల్స్‌లో కూడా అచ్చం అలాంటి కాన్సెప్ట్ తోనే కామెడీ షో మొదలు పెట్టి చేతులు కూడా కాల్చుకున్నారు. అలాంటి బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న జబర్దస్త్ కామెడీ షోపై ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వస్తున్నాయి.
ఒకప్పుడు అబ్బాయిలు లేడీ గెటప్ వేసుకొని కామెడీ చేసే వాళ్లు. అయితే గత కొన్ని నెలలుగా అమ్మాయిలు జబర్దస్త్‌లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రతీ టీమ్ లో కూడా ఒక అమ్మాయి ఉంది. వీళ్లకు కొందరు సీనియర్ కమెడియన్స్ నుంచి అసభ్య ప్రవర్తన ఎదురవుతుందని.. సాయంత్రం ఖాళీగా ఉన్నారా కలుద్దామా లాంటి అనుభవాలు సమస్యల రూపంలో వస్తున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. నిర్వాహకుల వరకు ఈ విషయం తీసుకెళ్లినా కూడా ఫలితం లేకుండా పోయిందని.. సదరు సీనియర్ కమెడియన్స్ ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ నిర్వాహకులకు తమ ధిక్కార స్వరం వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం బంగారం లాంటి జబర్దస్త్ ప్రతిష్ట మసకబారడం ఖాయం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ ఔట్.. ఇందులో నిజమెంత..?
hyper aadi: మీ దగ్గర డబ్బుల్లేవంటే చెప్పండి, ఇలా చేయకండిరా.. హైపర్ ఆది ఫైర్
Roja: సంపాదించినది అప్పులకే సరిపోయింది.. కన్నీరు పెట్టుకున్న రోజా
Sudheer: సొంత జిల్లా అమ్మాయిని పెళ్లి చేసుకోనున్న సుధీర్
Sudheer: ఒకప్పుడు తినడానికి తిండి ఉండేది కాదు, ఇప్పుడు కోటీశ్వరుడు..!