టాలెంట్ ఉన్నా సత్తా చాటే అవకాశం రాకపోతే అది నిరుపయోగంగానే ఉంటుంది. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న కామెడీ షో జబర్ధస్త్ లో పాల్గొంటున్న కమెడీయన్స్‌లో చాలా మంది పరిస్థితి ఒకప్పుడు దారుణంగా ఉండేది. అలాంటి వారికి జబర్ధస్త్ మంచి లైఫ్ ఇచ్చింది. ఈ షో తర్వాత చాలా మంది జీవితాలు మారాయి.
జబర్ధస్త్ షోతో సుడిగాలి సుధీర్‌గా ప్రేక్షకులకి పరిచయమైన ఈ కమెడీయన్ తన టాలెంట్‌తో ఇప్పుడు రెండు చేతులా సంపాదిస్తున్నాడు.ఒకప్పుడు ఇతని పరిస్థితి దారుణంగా ఉండేదట. కొన్నిసందర్భాలలో తినడానికి కూడా తిండి దొరికేది కాదట.ఇప్పుడు ఇటూ యాంకర్‌గా, కమెడియన్‌గానే కాకుండా అటూ సినిమాల్లోనూ హీరోగా తళుక్కుమంటున్నాడు.జబర్దస్త్ షోతో పాటు ఢీ ఛాంపియన్స్, పోవే పోరా లాంటి షోలు, ఇతర ఈవెంట్స్ చేస్తూ బిజీగా ఉన్నసుధీర్ వెండితెరపై సాఫ్ట్ వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాలు చేశాడు.
త్వరలో గాలోడు అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించనున్నాడు.ఒకప్పుడు కనీసం గూడు లేక హైదరాబాద్ లో రైల్వే స్టేషన్లోపడుకున్న సుధీర్ ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు. తన ఆస్తుల గురించి ఓ షోలో ఓపెన్ అయిన సుధీర్ హైదరాబాద్‌లో రెండు సొంతిళ్లు ఉన్నాయని, అంతేకాదు పలు స్థిరాస్తులు కూడా బాగానే కూడబెట్టుకుంటున్నానని వెల్లడించాడు.దీంతో నెటిజన్స్ ఓ పది కోట్లు వరకు సంపాదించి ఉంటాడని లెక్కలేస్తున్నారు.