Donald Trump : భారతదేశ ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi), తాను మాటల మనుషులం కాదని, చేతల మనుషులమని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్ (Iran) పై అమెరికా, ఇజ్రాయెల్ (Israel) యుద్ధం నేపథ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మాట చాలామంది ఇతర దేశాల అధినేతలకు వర్తించదని అన్నారు.
భారత్తో బంధం రానున్న రోజుల్లో మరింత బలపడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తంచేశారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను భారత్లోని యూఎస్ ఎంబసీ ఎక్స్ వేదికగా షేర్ చేసింది. పశ్చిమాసియా ఉద్రికతలు ప్రపంచ దేశాలపై ప్రభావం చూపుతోన్న తరుణంలో అమెరికా నుంచి ఈ స్పందన వచ్చింది. ఇదిలావుంటే రెండురోజుల క్రితం కూడా ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. హర్మూజ్ జలసంధిని తెరిచిఉంచాల్సిన ఆవశ్యకతపైనా చర్చలు జరిపారు. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ ఫోన్ సంభాషణపై మోదీ కూడా స్పందించారు. వీలైనంత త్వరగా ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని పునరుద్ధరించేందుకు భారత్ మద్దతుగా ఉంటుందని స్పష్టంచేశారు.