Jaya Bachchan | రామాయణ కాలం నాటి గౌరవం ఏది?.. ట్రాన్స్జెండర్ల బిల్లుపై జయా బచ్చన్ ఫైర్
Jaya Bachchan | పార్లమెంట్లో ట్రాన్స్జెండర్ల హక్కుల సవరణ బిల్లు-2026 ఆమోదం పొందిన వేళ రాజ్యసభలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Jaya Bachchan | పార్లమెంట్లో ట్రాన్స్జెండర్ల హక్కుల సవరణ బిల్లు-2026 ఆమోదం పొందిన వేళ రాజ్యసభలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ బిల్లుపై ప్రతిపక్ష నేతలు మండిపడుతుండగా.. ఈ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ అధికార పక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త బిల్లు అశాస్త్రీయంగా ఉందని, ఇవి ట్రాన్స్జెండర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని జయా మండిపడ్డారు. ముఖ్యంగా ట్రాన్స్జెండర్లు తమ గుర్తింపును నిరూపించుకోవడానికి మెడికల్ బోర్డు సర్టిఫికేట్ పొందాలనే నిబంధనను ఆమె తీవ్రంగా తప్పుబట్టింది. స్వయంగా తమ జెండర్‌ను ప్రకటించుకునే హక్కును కాలరాయడం అనేది చాలా అన్యాయమని, రామాయణ కాలం నుంచి గౌరవించబడుతున్న ఈ సమాజాన్ని ప్రభుత్వం ఎందుకు చిన్నచూపు చూస్తోందని ఆమె సూటిగా ప్రశ్నించింది. ట్రాన్స్జెండర్ల సమస్యలు నిజంగా తీరాలంటే వారి వర్గం నుంచే ఒకరిని పార్లమెంట్‌కు నామినేట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు చర్చా సమయంలో అధికార పక్ష సభ్యులు పదేపదే అంతరాయం కలిగించడంతో జయా బచ్చన్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అంతరాయం కలిగిస్తున్న సభ్యులను ఉద్దేశించి పిల్లలూ.. కూర్చోండి (Bacche baith jao) అంటూ గట్టిగా వారించడంతో సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

