Sai Pallavi | నెట్టింట సాయి పల్లవి పెళ్లి రూమర్స్ .. ఇప్పట్లో చేసుకునే ప్రసక్తే లేదంటున్న లేడీ పవర్ స్టార్
Sai Pallavi | దక్షిణాది సినీ పరిశ్రమలో సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సాయి పల్లవి మరోసారి వార్తల్లో నిలిచారు. డ్యాన్స్ షోల నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తన టాలెంట్‌తో టాప్ హీరోయిన్గా ఎదిగిన ఆమె ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి నుంచే నాట్యం, నటనపై ఆసక్తి ఉన్నప్పటికీ చదువును ప్రాధాన్యంగా తీసుకుని మెడికల్ డిగ్రీ పూర్తి చేసిన సాయి పల్లవి, ప్రేమమ్ సినిమాలో ‘మలర్ టీచర్’ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Sai Pallavi | దక్షిణాది సినీ పరిశ్రమలో సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సాయి పల్లవి మరోసారి వార్తల్లో నిలిచారు. డ్యాన్స్ షోల నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తన టాలెంట్‌తో టాప్ హీరోయిన్గా ఎదిగిన ఆమె ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి నుంచే నాట్యం, నటనపై ఆసక్తి ఉన్నప్పటికీ చదువును ప్రాధాన్యంగా తీసుకుని మెడికల్ డిగ్రీ పూర్తి చేసిన సాయి పల్లవి, ప్రేమమ్ సినిమాలో ‘మలర్ టీచర్’ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరై, తన సహజ నటన, తెలంగాణ యాసతో కుర్రకారును మెస్మరైజ్ చేసింది. దీంతో ఆమెకు ‘లేడీ పవర్ స్టార్’ అనే ట్యాగ్ కూడా వచ్చింది.
ప్రస్తుతం ఆమె కెరీర్ పీక్‌లో ఉంది. బాలీవుడ్లో జునైద్ ఖాన్ తో కలిసి ఓ సినిమాతో ఎంట్రీ ఇస్తుండగా, ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రామాయణం లో సీత పాత్ర పోషించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాగే తమిళంలో ధనుష్ సరసన కూడా ఓ భారీ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే, ఇటీవల ఆమె పెళ్లిపై వస్తున్న రూమర్లకు తానే స్వయంగా ఫుల్స్టాప్ పెట్టింది. ఒక కార్యక్రమంలో మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ సాయి పల్లవి స్పష్టంగా తన అభిప్రాయం వెల్లడించింది. “ప్రస్తుతం నా పూర్తి దృష్టి కెరీర్‌పైనే ఉంది. పెళ్లి గురించి ఇప్పట్లో ఎలాంటి ఆలోచన లేదు. నేను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నాను” అని చెప్పి అందరికీ క్లారిటీ ఇచ్చింది.
సాధారణంగా ఇలాంటి ప్రశ్నలకు స్టార్ హీరోయిన్లు ఊహించని సమాధానాలు ఇస్తుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం ఎలాంటి సందేహాలకు తావు లేకుండా సూటిగా చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఆమె పెళ్లి విషయంపై సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఫ్యాన్స్ ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం ఆమె పెళ్లి వార్త కోసం ఎదురుచూస్తున్నారు. ఏదేమైన పెళ్లి కంటే కెరీర్‌నే ప్రాధాన్యంగా తీసుకుంటూ ముందుకు సాగుతున్న సాయి పల్లవి నిర్ణయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

