sudigali sudheer | సుడిగాలి సుధీర్ అంటే కేరాఫ్ జబర్దస్త్ ( jabardasth ) కామెడీ షో అని అర్థం. ఎందుకంటే సుధీర్ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి కారణం మల్లెమాల ప్రొడక్షన్స్ . 8 ఏళ్లుగా జబర్దస్త్ కార్యక్రమంతో ఆయన అనుబంధం ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతుంది. జబర్దస్త్ కామెడీ షోకి ఎంతో మంది వచ్చారు వెళ్లిపోయారు.. కానీ సుడిగాలి సుధీర్ మాత్రం అక్కడే ఉన్నాడు. సినిమా అవకాశాలు ఎన్ని వచ్చినా కూడా డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నాడు.. కానీ తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షోను మాత్రం వదిలే సమస్య లేదని గతంలోనే చాలా సార్లు చెప్పాడు సుధీర్. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం దీని గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. త్వరలోనే సుధీర్ జబర్దస్త్ ( jabardasth ) నుంచి బయటకి వచ్చేస్తాడు అని గట్టిగానే ప్రచారం జరుగుతుంది.
మల్లెమాల ప్రొడక్షన్స్ ప్రతి ఏడాది జబర్దస్త్ కమెడియన్స్‌తో అగ్రిమెంట్ కుదుర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ అగ్రిమెంట్ బ్రేక్ చేసిన వాళ్లు మల్లెమాల ప్రొడక్షన్‌కు రూ.10 లక్షలు ఫైన్ కూడా కట్టాలి. గతేడాది బిగ్‌బాస్ 4 తెలుగులోకి వచ్చిన కమెడియన్ అవినాష్ కూడా మల్లెమాల ప్రొడక్షన్‌కు రూ. 10 లక్షలు కట్టి వచ్చాడు. ఇదిలా ఉంటే ప్రతి ఏటా వాళ్లతో అగ్రిమెంట్ కొనసాగించాలా లేదా అనేది ప్రొడక్షన్ నిర్ణయం తీసుకుంటుంది. కమెడియన్స్ కూడా తమ నిర్ణయం చెబుతుంటారు. ఈ సారి సుడిగాలి సుధీర్ అగ్రిమెంట్ కొనసాగించడానికి ఆసక్తి చూపించడం లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. హీరోగా ఆయన ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు. దాంతో పాటు కమెడియన్‌గా కూడా చాలా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి.
ఇటు అటు రెండు బ్యాలెన్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అందుకే ఈ ఏడాది తన అగ్రిమెంట్ క్యాన్సల్ చేసుకుంటున్నాడు అని తెలుస్తోంది. కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి మళ్లీ జబర్దస్త్‌లోకి రావాలని ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. అయితే ఇందులో నిజమెంత అనేది మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే సుడిగాలి సుధీర్ లేని జబర్దస్త్ ఊహించడం చాలా కష్టం. చమ్మక్ చంద్ర తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్‌కు అంత బాగా చేరువైన టీం సుధీర్. ఇప్పుడు ఆయన గాని వెళ్లిపోతే కచ్చితంగా అతనితో పాటు గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ కూడా బయటికి వచ్చేస్తారు. అదే జరిగితే జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ టీం పూర్తిగా మాయమవుతుంది. కచ్చితంగా ఇది టీఆర్పీ రేటింగ్స్‌పై మరింత ప్రభావం చూపించడం ఖాయం. మరి సుధీర్ తీసుకున్న ఈ నిర్ణయంపై మల్లెమాల ప్రొడక్షన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Sudheer : సొంత జిల్లా అమ్మాయిని పెళ్లి చేసుకోనున్న సుధీర్
Sudheer : ఒకప్పుడు తినడానికి తిండి ఉండేది కాదు, ఇప్పుడు కోటీశ్వరుడు..!
hyper aadi : మీ దగ్గర డబ్బుల్లేవంటే చెప్పండి, ఇలా చేయకండిరా.. హైపర్ ఆది ఫైర్
Bala Krishna : జబర్దస్త్ షోకి జడ్జిగా బాలకృష్ణ.. రోజా అడగడంతో నో అంటాడా మరి..!
యాక్టింగ్ కోసం గవర్నమెంట్ జాబ్ వదిలేసిన జబర్దస్త్ కమెడియన్