సుధీర్ .. జబర్ధస్త్ కార్యక్రమం తర్వాత సుడిగాలి సుధీర్‌గా మారిన విషయం తెలిసిందే.బుల్లితెర కింగ్‌గా మారిన సుధీర్ ఇప్పుడు ఈటీవీ ఏ ఈవెంట్ చేసిన కనిపిస్తూ ఉంటాడు. ఒకప్పుడు చిన్న చిన్న మ్యాజిక్‌లు చేసుకుంటూ వచ్చిన సుధీర్ ఇప్పుడు టీవీ షోలతో నెలకు లక్షల్లోనే సంపాదిస్తున్నట్టు తెలుస్తుంది. బుల్లితెరపై సుధీర్-రష్మీది మంచి జోడి.వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. దీనిని క్యాష్ చేసుకొని పలు ఈవెంట్స్‌లో వారిద్దరికి పెళ్లి చేసి మంచి రేటింగ్ కూడా రాబట్టారు.
అయితే 34 ఏళ్లు సుధీర్ .. రష్మీని కాకుండా సొంత జిల్లాకు చెందిన యువతిని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ సంబంధం సుధీర్‌కు బాగా నచ్చి ఓకే కూడా చెప్పేసినట్లు సమాచారం. దీనిపై సుధీర్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుధీర్ ప్రస్తుతం బుల్లితెర షోస్ చేస్తూనే అడపాదడపా వెండితెరపై కూడా తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ఆ మధ్య హీరోగా ఓ సినిమా చేయగా, అది ఫ్లాప్ కావడంతో కాస్త బ్రేక్ తీసుకున్నాడు.