టెహ్రాన్: హొర్ముజ్ జలసంధిని దాటడానికి ప్రయత్నించిన రెండు భారత నౌకలపై శనివారం ఇరాన్ గన్బోట్లు కాల్పులు జరిపిన ఘటనలో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి ఇరు దేశాల మధ్య కమ్యూనికేషన్ లోపం కారణంగా ఇది జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. చమురును తీసుకుని వస్తున్న భారత్కు చెందిన సన్మార్ హెరాల్డ్, జాగ్ అర్నవ్ నౌకలు హొర్ముజ్ జలసంధిని దాటుతుండగా, వాటిపై ఇరాన్ గన్బోట్ల నుంచి కాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా ఇరాన్ నేవీ అధికారులతో సన్మార్ హెరాల్డ్ నౌకలోని అధికారులు అనుమతించిన ఆడియోను సముద్ర రవాణా నిఘా సంస్థ ట్రాంకర్ ట్రాకర్స్ బయటపెట్టింది.