‘ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం’
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి అత్యంత శక్తివంతమైన వజ్రాయుధం వంటిదని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. శనివారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కోదాడ పట్టణం పెరిక హాస్టల్ ప్రాంగణంలో..
– సమగ్ర ఓటర్ల నమోదును సద్వినియోగం చేసుకోండి
– తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య
కోదాడ, జూలై 25 : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి అత్యంత శక్తివంతమైన వజ్రాయుధం వంటిదని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. శనివారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కోదాడ పట్టణం పెరిక హాస్టల్ ప్రాంగణంలో నిర్వహించిన పెరిక కులస్తుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓట్ల నమోదు, తొలగింపుల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా పెరిక కుల బిడ్డలు వెంటనే ఫారాలు నింపి బీఎల్వో లకు అందించి ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు.
ప్రజాస్వామిక దేశంలో ఓటే మన గుర్తింపు అని, సంక్షేమ పథకాల లబ్ధికి కూడా ఇది ఎంతగానో ముడిపడి ఉంటుందన్నారు. అనంతరం దేశ, విదేశాల్లో క్రీడల్లో సత్తా చాటిన కిత శ్రీనివాసరావుకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కందుల కోటేశ్వరరావు, కందుల చంద్రశేఖర్, తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు, పెరిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తిపాక జనార్ధన్, బత్తిని కృష్ణమూర్తి, నాళం రాజన్న, చిత్తలూరి సత్యనారాయణ, శివయ్య, రామినేని సత్యనారాయణ, పత్తిపాక కృష్ణ, అంకతి వెంకన్న, బరపాటి కోటేశ్వరరావు, బచ్చు అశోక్, దొంగరి శ్రీనివాస్, కితా శ్రీనివాసరావు, వనం నాగేశ్వరరావు, చిత్తలూరి శివలింగం పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

