IND vs ZIM : జింబాబ్వే గడ్డపై టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన భారత జట్టు రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సికిందర్ రజా బౌలింగ్ తీసుకున్నాడు. వరసగా ఎనిమిదిసార్లు టాస్ నెగ్గిన టీమిండియా సారథి శ్రేయాస్‌కు ఈసారి కలిసిరాలేదు. అయితే.. గత మ్యాచ్‌తో టీ20ల్లో అరంగేట్రం చేసిన పేసర్ అశోక్ శర్మకు తుది జట్టులో చోటు దక్కలేదు. అతడి స్థానంలో డెబ్యూ క్యాప్ అందుకున్న యశ్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చాడు.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టీ20లో గెలుపొందిన భారత్ రెండో విజయంపై కన్నేసింది. రికార్డు స్థాయిలో టాస్ నెగ్గిన శ్రేయాస్ అయ్యర్.. ఈసారి ఓడిపోగా.. జింబాబ్వే బౌలింగ్ తీసుకుంది. సిరీస్‌లో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో సికిందర్ రజా సేన సర్వశక్తులు ఒడ్డనుంది. టీమిండియా ఒక మార్పు చేయగా.. ఆతిథ్య జట్టు మాత్రం ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.
#TeamIndia‘s Playing XI for the 2nd T20I 🔽
Updates ▶️ https://t.co/Z8UUziVx8d
#ZIMvIND pic.twitter.com/KXedeQrr3V
— BCCI (@BCCI) July 25, 2026
జింబాబ్వే తుది జట్టు : బ్రియన్ బెన్నెట్, తడివనషె మరుమణి(వికెట్ కీపర్), బెన్ కర్రాన్, డియాన్ మయెర్స్, సికిందర్ రజా(కెప్టెన్), రియాన్ బురి, వెస్లీ మధీవరె, బ్రాడ్ ఎవాన్స్, న్యూమన్ న్యహుమ్రి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబని.
భారత తుది జట్టు : వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివం దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్.