LSG vs PBKS : ఐపీఎల్ 19లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఎదురైన ప్రత్యర్థినల్లా మట్టికరిపిస్తున్న శ్రేయస్ అయ్యర్ సేన ఈసారి లక్నో సూపర్ జెయింట్స్‌కు తమ పంచ్‌ను రుచిచూపింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(93), కూపర్ కొన్నొల్లీ(87)ల విధ్వంసకాండతో 254 రన్స్ కొట్టిన పంజాబ్ ఆపై లక్నోను వణికించింది. ఆరంభం నుంచి తడబడిన లక్నో మర్క్రమ్(42) పోరాటంతో రన్స్‌కు పరిమితమైంది. పంజాబ్ ఖాతాలో ఐదో విజయం చేరగా.. పంత్ బృందానికి నాలుగో ఓటమి ఎదురైంది.
ముల్లన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్ పంజాకు లక్నో సూపర్ జెయింట్స్ విలవిలలాడింది. ఆదివారం డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో పంజాబ్ దెబ్బకు లక్నో బదులివ్వలేకపోయింది. బౌలర్ల వైఫల్యంతో భారీ స్కోర్ సమర్పించుకున్న లక్నో.. 255 పరుగుల ఛేదనలో ఏ కోశాన లక్ష్యం దిశగా సాగలేదు. ఓపెనర్‌గా వచ్చిన ఆయుశ్ బదొని(35) ఔట్ చేసి లక్నోను ఒత్తిడిలో పడేశాడు.
BOTH SET BATTERS GONE! 🔥
🎥 Yuzvendra Chahal sends back Mitchell Marsh, Arshdeep Singh ends Rishabh Pant’s entertaining knock 👏
Updates ▶️ https://t.co/u5eUR1eqdA#TATAIPL | #KhelBindaas | #PBKSvLSG | @PunjabKingsIPL pic.twitter.com/Zqoevw6vkQ
— IndianPremierLeague (@IPL) April 19, 2026
విధ్వంసక హిట్టరైన మిచెల్ మార్ష్(40), రిషభ్ పంత్(43)లు రాణించినా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. హిట్టర్ పూరన్(9) విఫలమవ్వగా.. ఎడెన్ మర్క్రమ్(42), ముకుల్ చౌదరీ(21 నాటౌట్)లు పోరాడారు. కానీ, రన్‌రేటు అంతకంతకూ పెరిగిపోవడంతో వీరేమీ చేయలేకపోయాడు. లక్నో రెండొందలకే పరిమితవ్వగా పంజాబ్ 54 పరుగుల తేడాతో గెలుపొంది అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది.
ఐపీఎల్లో రికార్డుల మోతకు తెరదీసింది పంజాబ్ కింగ్స్. టోర్నీలో అజేయంగా దూసుకెళ్తున్న ఆ జట్టు ముల్లన్‌పూర్‌లో భారీ స్కోర్‌తో లక్నో సూపర్ జెయింట్స్‌ను భయపెట్టింది. టాస్ ఓడినా పంజాబ్‌కు శుభారంభం దక్కకున్ను.. కుర్రాళ్లు శివాలెత్తిపోయారు. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(0)ను తొలి ఓవర్లోనే ఔటైనా.. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లకు ప్రియాన్ష్ ఆర్య(93) చుక్కలు చూపించాడు. కూపర్ కొన్నొల్లీ(87) తో కలిసి విధ్వంసకాండ రచించిన ఈ కుర్రాడు మెరుపు అర్ధ శతకంతో రెచ్చిపోయాడు.

బౌలర్ మారినా బంతి గమ్యం స్టాండ్స్‌లోకి లేదా బౌండరీ గీత దాటించడమే లక్ష్యంగా వీరిద్దరూ చెలరేగారు. ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదేయగా పంజాబ్ స్కోర్ రాకెట్ వేగంతో పరుగులు తీసింది. శతకాల దిశగా దూసుకెళ్లిన ఈ జోడీని ప్రిన్స్ యాదవ్(2-25) విడదీసి లక్నో్కు ఊరటనిచ్చాడు. ఆ వెంటనే ప్రియాన్ష్‌ను సిద్దార్థ్(2-35) ఔట్ చేయగా.. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(5) నిరాశపరిచాడు. అనంతరం నేహల్ వధేరా(13), మార్కస్ స్టోయినిస్(29), శశాంక్ సింగ్(17)లు స్కోర్ బోర్డును ఉరికించారు. ఆఖరి ఓవర్లో చివరి బంతికి స్టోయినిస్ రనౌటవ్వగా పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది.