యాక్టింగ్ కోసం గవర్నమెంట్ జాబ్ వదిలేసిన జబర్దస్త్ కమెడియన్

గవర్నమెంట్ జాబ్ అనేది చాలామంది కల. ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయికే తమ కూతుర్ని ఇవ్వాలని ఆశ పడుతుంటారు. అది ప్రభుత్వ జాబ్‌కు ఉన్న డిమాండ్. కానీ ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంత సులువు కాదు. ఎంతో కష్టపడాలి. అలాంటిది తనకు నచ్చిన రంగం కోసం కష్టపడి సాధించిన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు ఓ జబర్దస్త్ కమెడియన్. అతను ఎవరో కాదు అప్పట్లో పటాస్.. ఇప్పుడు జబర్దస్త్ షోలో పంచ్‌లు పేలుస్తూ ఫన్ ఇస్తున్న నూకరాజు.
పటాస్ కామెడీ షోతో నూకరాజు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపుతోనే పటాస్ తర్వాత జబర్దస్త్‌లో కమెడియన్‌గా అవకాశం పొందాడు. అయితే పటాస్ కంటే ముందు జీ తెలుగులో ఒక కామెడీ షో కూడా చేశాడు నూకరాజు. ప్రస్తుతం జిగేల్ జీవన్ టీంలో చేస్తూ పంచ్‌లు పేలుస్తున్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నూకరాజు.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. పర్సనల్ విషయాలు చెబుతూనే.. యాక్టింగ్ ఫీల్డ్‌లోకి రాకముందు ఏం చేసేవాడో చెప్పుకొచ్చాడు. పటాస్ షోకు రాకముందు విజయవాడ పవర్ ప్లాంట్‌లో ఉద్యోగం చేసేవాడు. ఉద్యోగం చేస్తూనే యాక్టింగ్ అవకాశాల కోసం ట్రై చేశాడు. అలాంటి సమయంలో జీ తెలుగులో ఒక కామెడీ షోలో అవకాశం వచ్చింది. ఉద్యోగం చేస్తూ కామెడీ షోలో నటించడం ఇబ్బందిగా అనిపించింది. దీంతో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి.. నచ్చిన రంగంవైపే అడుగులు వేశా. అని ఆ ఇంటర్వ్యూలో నూకరాజు చెప్పుకొచ్చాడు. నూకరాజు మాత్రమే కాదు ఇంతకు ముందు కూడా చాలా మంది తమకు వచ్చిన బంగారం లాంటి అవకాశాలను వదులుకొని నచ్చిన సినిమా రంగం కోసం వచ్చేశారు. ఇప్పుడు ఈ కుర్రాడు కూడా ఇదే చేశాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ట్రక్కు డ్రైవర్ గా రకుల్‌ప్రీత్‌సింగ్
పవన్ కళ్యాణ్‌తో మరో సినిమా ప్లాన్ చేస్తున్న దిల్ రాజు
ఉప్పెన డైరెక్టర్ తో తారక్..రెమ్యునరేషన్ హాట్ టాపిక్..!
అల్లు అర్జున్ పాటను వాడేసిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్
కలర్స్ స్వాతి రీ ఎంట్రీ.. కొత్త కాన్సెప్ట్‌తో అలరించేందుకు రెడీ..!
జాతి రత్నాలు సీక్వెల్‌కు సన్నాహాలు.. స్టోరీ లైన్ ఇదే!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

