Bala Krishna: జబర్దస్త్ షోకి జడ్జిగా బాలకృష్ణ.. రోజా అడగడంతో నో అంటాడా మరి..!

నందమూరి బాలకృష్ణ వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా సందడికి సిద్ధం అంటున్నాడు. ఇప్పటికే ఆయన వ్యాఖ్యాతగా ‘ఆహా’ ఓటీటీలో ‘అన్‌స్టాపబుల్’ అనే కార్యక్రమం కన్ఫాం అయింది. నవంబరు 4వ తేదీ నుంచి ఈ షో ప్రారంభం కానుంది. ‘ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రయాణం ఉంటుంది. రాయికి ఎన్నో దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో ఎత్తు పల్లాలుంటాయి. వాటిని అధిగమించి ఒక లక్ష్యాన్ని చేరడమే ‘అన్‌స్టాపబుల్ అని బాలయ్య ఇటీవల చెప్పుకొచ్చారు.
ఇక ఇప్పుడు ఆయన జబర్ధస్త్ షోకి జడ్జిగా కూడా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.జబర్ధస్త్ వేదికపై నుండి రోజా..బాలకృష్ణకి కాల్ చేయగా, హా రోజా గారు నమస్కారం అంటూ తన సంస్కారాన్ని చూపించారు. నేను జబర్దస్త్ లో ఉన్నానని రోజా చెప్పడంతో పాటు మీరేం చేస్తున్నారని బాలయ్యను అడగగా అఖండ షూటింగ్ జరుగుతోందని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. మళ్లీ మనిద్దరం కలిసి ఎప్పుడు యాక్ట్ చేద్దామని రోజా అడిగింది.
భైరవద్వీపం పార్ట్ 2 చేస్తారా లేక బొబ్బిలి సింహం పార్ట్ 2 చేస్తారా అని అడుగుతున్నారని రోజా చెప్పగా.. రోజా అలా చెప్పగానే బాలకృష్ణ నవ్వి తప్పుకుండా చేద్దాం అందరూ ఎదురుచూస్తున్నారు.. మన కాంబినేషన్ కోసం.. కలిసి సినిమా చేయడమే కాదు.. జబర్దస్త్ షోకి జడ్జీగా కూడా వస్తాను.. మీ అందర్నీ కలుస్తాను అని మాట ఇచ్చారు బాలయ్య. దీంతో రోజా థాంక్యూ సో మచ్ సార్ అని అనేసింది. అనంతరం బాలయ్య.. ఆది, రాఘవ వీళ్లంతా ఎలా ఉన్నారు అని కూడా అడిగారు. దీంతో స్టేజ్‌పై ఉన్న వాళ్లందరు ఆశ్చర్యానికి గురయ్యారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bala krishna
- jabardasth
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

