Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
Rare opportunity | మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ జాతీయ స్థాయిలో సైన్స్ ప్రదర్శనల్లో ప్రతిభ చాటిన సిద్దిపేట జిల్లా రాయపోల్ బేగంపేట విద్యార్థులకు అరుదైన అవకాశం లభించింది.
రాయపోల్ : మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ జాతీయ స్థాయిలో సైన్స్ ప్రదర్శనల్లో ప్రతిభ చాటిన సిద్దిపేట జిల్లా రాయపోల్ బేగంపేట విద్యార్థులకు ( Begumpet student ) అరుదైన అవకాశం ( Rare opportunity )లభించింది. ఈ నెల 14న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ( Rashtrapati Bhavan )లో నిర్వహించే బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆహ్వానం అందింది.
జాతీయ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లు, విజ్ఞాన ప్రదర్శనల్లో విద్యార్థులు ప్రదర్శించిన సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచనలు, నూతన ఆవిష్కరణల ఫలితంగా ఈ అవకాశం దక్కిందని ప్రధానోపా ధ్యాయురాలు ప్రమీల తెలిపారు. రాష్ట్రపతిని కలుసుకుని రాష్ట్రపతి భవన్లో జరిగే వేడుకల్లో పాల్గొనడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు.
ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది : విద్యార్థిని దరిపల్లి పావని

రాష్ట్రపతి భవన్‌ను సందర్శించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత పెరిగాయని, భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలు సాధించి దేశానికి మంచి పేరు తేవాలన్నదే తనలక్ష్యమని అన్నారు.
ఈ అవకాశం ఎంతో అదృష్టం : మంద హర్షవర్ధన్

రాష్ట్రపతి భవన్‌ను సందర్శించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. పాఠశాలలో నిర్వహించే సైన్స్ ప్రయోగాలు, తి ప్రాజెక్టులు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచాయి. భవిష్యత్తులో శాస్త్రవేత్తగా ఎదిగి దేశ అభివృద్ధికి కృషి చేయాలనేది తన కల అని వెల్లడించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

