Thandel | టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) నటిస్తోన్న తాజా చిత్రం తండేల్ (Thandel). చందూమొండేటి డైరెక్షన్లో రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో సాయిపల్లవి (Sai Pallavi) హీరోయిన్గా నటిస్తోంది. 2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోన్న ఈ మూవీని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు.
ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం. తాజాగా బన్నీవాసు అండ్ తండేల్ టీం దివంగత మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్‌ను కలిసింది. ఇంతకీ వీరంతా ఎందుకు కలిశారో తెలుసా..?
2017-2018 కాలంలో పాకిస్థానీ జైళ్లలో చిక్కుకుపోయిన మత్స్యకారులను వెనక్కి తీసుకురావడంలో మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ కీలక పాత్ర పోషించారని తెలిసిందే. సుష్మా స్వరాజ్ చిరస్మరణీయ సేవలను గుర్తు చేసుకుంటూ తండేల్ టైటిల్ కార్డ్స్‌లో ఆమె పేరును షేర్ చేసేందుకు అనుమతిచ్చిన బన్సూరి స్వరాజ్‌కు ధన్యవాదాలు తెలియజేసింది.
ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. తండేల్ నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Ram Gopal Varma | సిండికేట్‌పై వర్క్ చేస్తున్నా.. కానీ ఆ వార్తలు అబద్ధం.. పుకార్లపై రాంగోపాల్ వర్మ