బాలీవుడ్ లో రీమేక్ సినిమాలంటే ఠక్కున గుర్తొచ్చే పేరు అక్షయ్ కుమార్. ఇప్పటికే పలు దక్షిణాది సినిమాల రీమేక్ లో నటించిన ఈ స్టార్ హీరో తెలుగులో వచ్చిన రాక్షసుడు చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించాడు. అక్షయ్ కుమార్ కన్ను మరో సూపర్ హిట్ సినిమాపై పడ్డది. సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా.
సుధా కొంగర డైరెక్షన్ లో దక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఓటీటీలో విడుదలై మంచి హిట్ గా నిలిచింది. ఈ హిట్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని చూస్తున్నాడట అక్కీ భాయ్. ఎబండెన్షియా ఎంటర్ టైన్ మెంట్‌తో కలిసి సూర్య ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం. ఒరిజినల్ వెర్షన్ కు దర్శకత్వం వహించిన సుధాకొంగర హిందీ రీమేక్ బాధ్యతలను చూసుకోనున్నారు.
అక్షయ్ కుమార్ చేతిలో ప్రస్తుతం బచ్చన్ పాండే, బెల్ బాటమ్ , సూర్యవంశి చిత్రాలున్నాయి. వీటితోపాటు రామ్ సేతు సినిమాలో కూడా నటిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
సినిమాలకు యువ హీరో గుడ్‌బై..?
ఇంటి పేరు తెచ్చిన తంటా..కరణ్ కుంద్రాకు చిక్కులు
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?
‘బంగార్రాజు’కు కృతిశెట్టి రెమ్యునరేషన్ ఎంతంటే..?
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?