అందం, అభినయంతోపాటు హాట్ హాట్ అందాలతో కట్టిపడేసే భామలకు ఇండస్ట్రీలో కొదవేమి లేదు. ఆ లిస్టులో టాప్ ప్లేస్లో ఉంటుంది బాలీవుడ్ (Bollywood)భామ ఊర్వశి రౌటేలా
(Urvashi Rautela) . ఈ బ్యూటీ నెట్టింట్లో చురుకుగా ఉంటూ తన అప్ డేట్స్ ను ఫాలోవర్లతో పంచుకుంటూ అందరిలో జోష్ నింపుతుంటుంది. తాజాగా ఊర్వశి సోషల్ మీడియాను షేక్ చేసే ఫొటోలతో దర్శనమిస్తోంది. మెస్మరైజ్ చేసే అందంతో అందరినీ కట్టిపడేసే ఊర్వశి..ఈ సారి కాస్త రూటు మార్చి బంగారు బొమ్మ (గోల్డెన్ డాళ్)గా మారిపోయింది.
అరబ్ ఫ్యాషన్ వీక్ (Arab Fashion Week)అమాటో షోలో బంగారు వర్ణపు డ్రెస్లో ధగ ధగ మెరిసిపోయింది. 24 క్యారెట్స్ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ చేస్తుందా అన్నట్టుగా ప్రేక్షకుల కండ్లు పక్కకు తిప్పుకోనీయకుండా చేసింది. గోల్డెన్ జాకెట్, గోల్డ్ టోన్డ్ చైన్ తో డిజైన్ కొప్పుతో అందరినీ కట్టిపడేస్తూ..షోకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిపోయింది. ఊర్వశి రౌటేలా బ్లాక్ రోజ్ సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలుకరించింది.
మరోవైపు ఓ సినిమాతో (టైటిల్ ఖరారు కాలేదు) తమిళ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. మొత్తానికి ఓ వైపు సినిమాలతో ఎంటర్ టైన్ చేస్తూనే..మరోవైపు ఇలా అప్పుడపుడు అందాల ఆరబోతతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.