Rozlyn Khan | సినీ పరిశ్రమలో మరో హీరోయిన్ క్యాన్సర్ బారిన పడింది. ఐపీఎల్ ఫొటోషూట్‌తో గుర్తింపు తెచ్చుకున్న రోజ్లిన్ ఖాన్ ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుంది. ఈ విషయాన్ని స్వయంగా బాలీవుడ్ నటి రోజ్లిన్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తన మనసులోని ఫీలింగ్స్‌ను ధైర్యంగా రాసుకొచ్చింది.
బలమైన సైనికులకే దేవుడు కష్టమైన యుద్ధాలను అప్పగిస్తాడని ఇన్‌స్టాలో రోజ్లిన్ ఖాన్ పేర్కొంది. ఇది తన జీవితంలో ఒక భాగం మాత్రమే కావచ్చని.. నమ్మకంతో ముందుకు సాగడమే తన ముందు ఉన్న లక్ష్యమని చెప్పింది. ప్రతి సమస్య తనను మరింత దృఢంగా చేస్తోందని.. ఇది కూడా అలాంటిదేనని చెప్పుకొచ్చింది. తను త్వరగా కోలుకోవాలని కోరుకునేవారు చాలామందే ఉన్నారని పేర్కొంది. ఇక ప్రస్తుతానికి మెడ నొప్పి, వెన్ను నొప్పి తప్పితే మరేమీ లేవని స్పష్టం చేసింది. మొదట్లో జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న కారణంగా వస్తున్న నొప్పి అనుకున్నానని.. కానీ అదృష్టవశాత్తూ క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించగలిగామని తెలిపింది.
” డియర్ బ్రాండ్స్.. రాబోయే ఏడు నెలలు కీమోథెరపీ చేయించుకోవాల్సి ఉంది. ప్రతి సెషన్ తర్వాత వారం రోజుల విశ్రాంతి అవసరం పడుతుంది. కాబట్టి ప్రతి నెల రెండో వారం మాత్రమే మీకు అందుబాటులో ఉంటారు. గుండుతో ఉన్న మోడల్‌తో పనిచేయడానికి మీకు చాలా ధైర్యం కావాలి. ప్రస్తుతానికి అయితే లైవ్‌లోకి వస్తానంటూ” రోజ్లిన్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్టు పెట్టింది.
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రోజ్లిన్ ఖాన్ ఐపీఎల్ ఫొటోషూట్‌తో పాపులారిటీ సంపాదించుకుంది. అప్పట్లో కీపింగ్, బ్యాటింగ్ చేస్తూ ఈమె దిగిన ఫొటోలు బాగా వైరల్‌గా మారాయి. ఆ గుర్తింపుతో సినిమాల్లో ఈమెకు అవకాశాలు వచ్చాయి. దమా చౌడ్కీ, సవితా బాబీ, జీ లేనేదో ఏక్ పల్ వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత క్రైమ్ అలర్ట్ షో ద్వారా బుల్లితెర మీద కూడా సందడి చేసింది. ఒకవైపు యాడ్స్, మరోవైపు షూటింగ్స్‌తో బిజీగా ఉన్న రోజ్లిన్ ఖాన్ ఇప్పుడు క్యాన్సర్ బారిన పడినట్లు ప్రకటించడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ఇదిలా ఉంటే రోజ్లిన్ ఖాన్ కంటే ముందు మనీషా కోయిరాలా, సోనాలి బింద్రే, మమతా మోహన్‌దాస్, గౌతమి వంటి హీరోయిన్లు ధైర్యంగా క్యాన్సర్‌ను జయించారు.
వాల్తేరు వీరయ్యలో బాలీవుడ్ బ్యూటీ.. మెగాస్టార్‌తో ఫొటోను షేర్ చేసిన ఊర్వశి రౌటెలా