Radhika Apte | యంగ్ హీరోయిన్స్‌పై రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్
Radhika Apte | గ్లామర్ కంటే కూడా నటనకు ప్రాధాన్యమిచ్చే హీరోయిన్లలో రాధికా ఆప్టే ఒకరు. అందుకే ఈమెకు బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ సినిమాల్లోనూ మంచి ఆఫర్లు వస్తున్నాయి.
Radhika Apte | గ్లామర్ కంటే కూడా నటనకు ప్రాధాన్యమిచ్చే హీరోయిన్లలో రాధికా ఆప్టే ఒకరు. అందుకే ఈమెకు బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ సినిమాల్లోనూ మంచి ఆఫర్లు వస్తున్నాయి. రక్తచరిత్ర, లెజెండ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రాధికా.. ఇక్కడ మాత్రం పెద్దగా సినిమాలేవీ చేయలేదు. లయన్ తర్వాత టాలీవుడ్‌కు దూరమైంది. పూర్తిగా హిందీ, ఇంగ్లిష్ సినిమాలకే పరిమితమైంది. తాజాగా ఈమె నటించిన హిందీ సినిమా మోనికా.. ఓ మై డార్లింగ్ సినిమా శుక్రవారం నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాధికా ఆప్టే.. యంగ్ హీరోయిన్స్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
ఎప్పుడైనా లుక్స్‌పరంగా అవకాశాలు కోల్పోయారా? అని మీడియా అని ప్రశ్నకు బదులిస్తూ.. హీరోయిన్లకు ఆఫర్లు రావడం అనేది వయసుపై ఆధారపడి ఉంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. చాలామంది ప్రొడ్యూసర్లు యంగ్ హీరోయిన్లనే తమ సినిమాల్లోకి తీసుకోవాలని అనుకుంటారని చెప్పింది. అందుకే కమర్షియల్ సినిమాల్లో వాళ్లకే ఎక్కువ ఆఫర్లు వస్తాయని తెలిపింది. ఇంతటితో ఆగకుండా.. హీరోయిన్లకు కావాల్సిన లక్షణాలు మీలో లేవనే కామెంట్స్ ఇండస్ట్రీలో తరచుగా వినబడుతుంటాయని పేర్కొంది. టాలెంట్‌ను బట్టి కాకుండా గ్లామర్‌ను బట్టి ఆఫర్లు ఇవ్వడం ఇండియాలోనే కాదు.. విదేశాల్లోనూ ఉందని రాధికా ఆప్టే వెల్లడించింది. అందుకే ఆఫర్స్ కోసం చాలామంది సర్జరీలు చేయించుకుంటున్నారని పేర్కొంది. అయితే తను మాత్రం అందంగా కనిపించాలని ఎప్పుడూ సర్జరీలను నమ్ముకోలేదని తెలిపింది. అవకాశాల కోసం ఏనాడూ అడ్డదారులు తొక్కలేదని స్పష్టం చేసింది. సక్సెస్ కోసం మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.
Read More :
హీరోయిన్ కొన్నిసార్లు నచ్చకపోయినా..!
“Huma Qureshi | ఎరుపెక్కిన అందాలతో కేకపుట్టిస్తున్న హుమా ఖురేషి..”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- netflix
- ott
- Radhika apte
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

