కొన్నిసార్లు తన క్యారెక్టర్స్ నచ్చకపోయినా నటించాల్సి వస్తున్నదని చెబుతున్నది బాలీవుడ్ తార రాధిక ఆప్టే. మనకు నచ్చే సినిమాలు చేయడం కంటే హిట్ చిత్రాల్లో కనిపించామా లేదా అన్నదే ఇండస్ట్రీకి ముఖ్యమని ఆమె అంటున్నది. ఇటీవల ఈ తార నటించిన ‘విక్రమ్ వేద’ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ చిత్రంలో స్వల్ప నిడివి గల కీలక పాత్రలో నటించింది రాధిక ఆప్టే. ఆమె మాట్లాడుతూ…‘గతంలో కొన్ని పాత్రలు నచ్చకున్నా నటించాను. మనం ఇష్టపడినా, లేకున్నా సక్సెస్ అనేది ఇక్కడ ముఖ్యం. అయితే ఈ కథ ఆకట్టుకుంది. ఇకపై కథను నడిపే పాత్రల్లో నటించాలని అని చెప్పింది. రాధిక ప్రస్తుతం ‘మోనిక ఓ మై డార్లింగ్’ చిత్రంలో నటిస్తున్నది.