Urvashi Rautela | మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో నటిస్తున్నాడు. చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. చాలాకాలం తర్వాత చిరంజీవి ఊర మాస్ పాత్ర పోషిస్తుండగా.. మాస్ మహరాజ్ రవితేజ సైతం కీలక పాత్ర పోషిస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో చిత్రం తెరకెక్కుతున్నది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టైటిల్ టీజర్ విడుదలవగా.. మెగా అభిమానులను ఆకట్టుకున్నాయి. చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా స్పెషల్ సాంగ్‌లో మెగాస్టార్‌తో స్టెప్పులు వేయనున్నది.
ఈ మేరకు చిరంజీవితో ఉన్న ఫొటోను హాట్‌బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. ‘నేను అవార్డులు గెలుచుకున్నప్పుడు నా తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తాను. నాకు అత్యుత్తమంగా ఉండడం అంటే నన్ను నేను ఈ విశ్వంలో నిరూపించుకోవడం’ అని ఫొటోకు కామెంట్‌ను జత చేసింది. ఈ సందర్భంగా అవకాశం కల్పించిన మెగాస్టార్, దర్శకుడు బాబీ, మైత్రీ మూవీమేకర్స్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఇదిలా ఉండగా.. ‘వాల్తేరు వీరయ్య’లో ఊర్వశి స్పెషల్ సాంగ్‌తో పాటు కీలక పాత్రలో సైతం కనిపించనున్నట్లు తెలుస్తున్నది.