ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 15, 2020 , 21:14:18

రోహిత్ శెట్టి సినిమాలో పూజాహెగ్డే..?

రోహిత్ శెట్టి సినిమాలో పూజాహెగ్డే..?

తెలుగు, హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అంద‌రినీ అల‌రిస్తోంది పూజాహెగ్డే. స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టిస్తూ నిర్మాత‌లకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ తో క‌లిసి రాధేశ్యామ్ చిత్రంతోపాటు నిఖిల్‌తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమాలో న‌టిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టి సినిమాలో వ‌న్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ లో న‌టించ‌నున్న‌ట్టు బీటౌన్ లో టాక్ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం రోహిత్ శెట్టి అక్ష‌య్ కుమార్ తో సూర్య‌వంశి చిత్రాన్ని చేస్తుండ‌గా...ఈ మూవీలో ర‌ణ్ వీర్ సింగ్ గెస్ట్ రోల్ లో క‌నిపించ‌నున్నాడు.

రోహిత్ శెట్టి-ర‌ణ్ వీర్ సింగ్ తో తదుప‌రి సినిమా చేయ‌నుండ‌గా..హీరోయిన్ గా పూజాహెగ్డే పేరును ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. పూజాహెగ్డే ఇప్ప‌టికే స‌ల్మాన్ ఖాన్ తో ఓ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు వార్త‌లు రాగా..మ‌రి రోహిత్ శెట్టి ప్రాజెక్టులో న‌టిస్తుందా...? చూడాలి.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo