అఖండ సినిమాకు భారీ బడ్జెట్ ?
అఖండ సినిమా కోసం బోయపాటి దాదాపు రూ.70కోట్లు బడ్జెట్ అడిగినట్లు తెలుస్తోంది. కేవలం యాక్షన్ సీన్ల కోసమే దాదాపు రూ.30 కోట్లు ఖర్చు పెట్టాలని బోయపాటి ప్లాన్ చేశాడని సమాచారం.

బాలయ్య హీరోగా బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న సినిమా అఖండ. సింహా, లెజెండ్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో అఖండ సినిమా కోసం బోయపాటి దాదాపు రూ.70కోట్లు బడ్జెట్ అడిగినట్లు తెలుస్తోంది. కేవలం యాక్షన్ సీన్ల కోసమే దాదాపు రూ.30 కోట్లు ఖర్చు పెట్టాలని బోయపాటి ప్లాన్ చేశాడని సమాచారం.
ఇప్పటికే అఖండ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో ఒకటి అఘోరా కావడం విశేషం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మొన్న విడుదలైన టీజర్ అయితే యూట్యూబ్‌లో సంచలనాలు రేపుతుంది. 50 మిలియన్ వ్యూస్ వైపు అడుగులు వేస్తుంది. ఈ సినిమాకు ముందు దాదాపు రూ. 70 కోట్లు బడ్జెట్ బోయపాటి అడిగాడని తెలుస్తుంది. అందులో కేవలం యాక్షన్ సన్నివేశాల కోసం రూ.30 కోట్లు ఖర్చు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి శ్రీను. అయితే రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమా ఫలితం చూసిన తర్వాత ఈ సినిమాను కేవలం రూ.40 నుంచి రూ.45 కోట్ల లో పూర్తి చేయాలని బాలయ్య కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. తన బిజినెస్ రూ.50 కోట్లు దాటదని.. 70 కోట్లు పెడితే ఎలా వర్కవుట్ అవుతుందని బాలయ్య ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చివరికి బోయపాటి అనుకున్నట్లుగానే సినిమాకు రూ.60 కోట్లకు పైగా బడ్జెట్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. అఖండపై ఉన్న క్రేజ్ చూస్తుంటే అంత రావడం ఈజీగానే అనిపిస్తుంది కానీ బాలయ్యకు అంత మార్కెట్ ఉందా అనేది అసలు అనుమానం. ఎందుకంటే బాలయ్య కెరీర్లో ఇప్పటి వరకు బిగ్గెస్ట్ హిట్ శాతకర్ణి.. ఈ చిత్రం రూ.48 కోట్లు వసూలు చేసింది. లెజెండ్ 40 కోట్లకు చేరువగా వచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
ఓటీటీలో ఏ1 ఎక్స్‌ప్రెస్ సందడి ఎప్పుడంటే..?
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్‌కు బెదిరింపులు.. చంపేస్తామంటూ వార్నింగ్
సమంతతో సెల్ఫీ..మేకర్స్ బర్త్ డే విషెస్
శర్వానంద్ ‘ది లైఫ్ ఆఫ్ రామ్’ అరుదైన ర…
‘బాహుబలి 2’ సినిమాకు నాలుగేళ్ళు పూర్తి.. 450 కోట్ల…
సోనాల్ చౌహాన్ హాట్ సెల్ఫీ..ఫొటో వైరల్
ఆర్ఆర్ఆర్ యాక్టర్ ఔదార్యం..కోవిడ్ కేర్ ఏర్పాటు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

