Hamida Khatoon | సాహసం చేయరా ఢింబకా సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది హమీదా. తెలుగుతో పాటు తమిళంలోనూ ఒక సినిమాలోనూ చేసింది. కానీ చెప్పుకోదగ్గ గుర్తింపు దక్కలేదు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టడం ఆమె జీవితాన్నే మార్చేసింది. అంతకుముందు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఒక్క బిగ్ బాస్ రియాలిటీ షోతో దక్కించుకుంది. సీజన్ 5లో సింగర్ శ్రీరామ్‌తో నడిపిన లవ్ ట్రాక్ హమీదాను పాపులర్ చేసింది. యాంకర్ రవితో కలిసి ఆ షోలో రచ్చ చేసింది. అందుకే ఆ సీజన్ అయిపోగానే బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో కూడా అవకాశం దక్కించుకుంది. మొత్తానికి బిగ్‌బాస్ షోతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ బ్యూటీ ఇప్పుడు ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారు కొనుగోలు చేసింది.
దీపావళి సందర్భంగా బిగ్‌బాస్ బ్యూటీ హమీద మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసింది.ఈ మోడల్ కారు ధర రూ.50 లక్షలకు పైగానే ఉంటుంది. కాగా కారు కొనుగోలు చేసిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. కొత్త కారు కొన్నట్లుగా చెప్పుకొచ్చింది. కారు కొనుగోలు చేసిన తర్వాత యాంకర్ రవి, అతని భార్య నిత్య సక్సేనాతో జాలీగా ఓ రైడ్ కూడా వెళ్లింది. వీటికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఇది చూసి హమీదకు ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. హమీదా పోస్టుకు సింగర్ శ్రీరామ్ కూడా స్పందించాడు. కంగ్రాట్స్ అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి థ్యాంక్యూ అంటూ హమీదా రిప్లై ఇచ్చింది. ఈ క్రమంలో శ్రీరామ్‌తో డ్రైవ్‌కు ఎప్పుడు వెళ్తావ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Prithiveeraj | లేటు వయసులో 24 ఏళ్ల అమ్మాయిని నటుడు పృథ్వీ రెండో పెళ్లి చేసుకున్నాడా?
మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత.. ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడి