Adipurush Run Time | ప్రభాస్ అభిమానులతో పాటు సినీ సెలబ్రెటీలు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల తర్వాత ప్రభాస్ ‘ఆదిపురుష్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. టీజర్‌కు మొదట మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. ఆ తర్వాత 3డీలో రిలీజ్ చేయడంతో ప్రేక్షకుల నుండి పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. మైథలాజికల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సినిమా రన్‌టైం మరీ ఎక్కువగా ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. ఆదిపురుష్ రన్ టైం దాదాపు 3 గంటల 16 నిమిషాలు ఉండనుందట. అయితే ఇంత లెంగ్తీ రన్ టైం ఉంటే ఆదిపురుష్ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారా అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతుంది. కాగా ఆదిపురుష్ రన్ టైం నిజంగానే అంత ఎక్కువగా ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని ఓం రౌత్ రామాయణం నేపథ్యంలో తెరకెక్కించాడు. ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా.. కృతి సనన్ సీతాదేవి పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురుడుగా కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో నిర్మించాయి.
Read Also:
Varasudu Movie | టాప్ మ్యూజిక్ సంస్థకు ‘వారసుడు’ ఆడియో రైట్స్.. ఎన్ని కోట్లో తెలుసా?
Hari Hara Veeramallu | పవన్ కళ్యాణ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు?
Akshay Kumar | అక్షయ్‌కు ఈ ఏడాది కలిసిరాలేదా.. వరుస ఫ్లాప్స్‌తో తగ్గిన మార్కెట్..!
Pathaan Movie | ‘పఠాన్’ మూవీ క్రేజీ అప్డేట్.. షారుఖ్ ఫ్యాన్స్‌కు పండగే..!