Hari Hara Veeramallu | పవన్ కళ్యాణ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు?
Hari Hara Veeramallu Movie | 'అజ్ఞాతవాసి' తర్వాత పవన్ మూడేళ్ళు గ్యాప్ తీసుకొని 'వకీల్ సాబ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతేడాది రిలీజైన ఈ చిత్రం భారీ వసూళ్ళను సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
Hari Hara Veeramallu Movie | ‘అజ్ఞాతవాసి’ తర్వాత పవన్ మూడేళ్ళు గ్యాప్ తీసుకొని ‘వకీల్ సాబ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతేడాది రిలీజైన ఈ చిత్రం భారీ వసూళ్ళను సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అదే జోష్‌తో ఈ ఏడాది ‘భీమ్లానాయక్’తో ప్రేక్షకులను పలకరించాడు. రానా కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. కానీ బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. ప్రస్తుతం ఈయన క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో మేజర్ షెడ్యూల్‌ను ప్రారంభించింది. అయితే ఈ షెడ్యూల్లో పవన్ ఇంకా జాయిన్ కానట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రం కోసం బాలీవుడ్ నటుడు రంగంలోకి దిగినట్లు టాక్. బాలీవుడ్ టాప్ యాక్టర్ బాబీ డియోల్ ఈ చిత్రంలో భాగం కానున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఔరంగజేబు పాత్ర కోసం క్రిష్, బాబీ డియోల్‌ను సంప్రదించినట్లు టాక్. కాగా మొదట ఈ పాత్రను అర్జున్ రామ్‌పాల్ చేయాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్‌కు పొలిటికల్ కమిట్మెంట్స్ ఉండటంతో షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. ఈ క్రమంలో అర్జున్ రామ్‌పాల్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడట. ఈ క్రమంలో క్రిష్ ఆ పాత్ర కోసం బాబీ డియోల్‌ను సంప్రదించాడట. పాత్ర నచ్చడంతో బాబీ డియోల్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే చాన్స్ ఉంది.
పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ. దయాకర్‌రావు, ఏ.ఎమ్ రత్నం అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నాడు.
Read Also:
Varasudu Movie | టాప్ మ్యూజిక్ సంస్థకు ‘వారసుడు’ ఆడియో రైట్స్.. ఎన్ని కోట్లో తెలుసా?
Rishab Shetty | రిషబ్‌శెట్టిని సత్కరించిన సూపర్‌స్టార్.. ‘కాంతార’ హీరో ట్వీట్ వైరల్
Sir Movie | ధనుష్ ‘సార్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది..!
Pathaan Movie | ‘పఠాన్’ మూవీ క్రేజీ అప్డేట్.. షారుఖ్ ఫ్యాన్స్‌కు పండగే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

