Pathaan Movie | ‘పఠాన్’ మూవీ క్రేజీ అప్డేట్.. షారుఖ్ ఫ్యాన్స్‌కు పండగే..!
Pathaan Movie Latest Update | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుండి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళయింది. 'జీరో' తర్వాత ఇప్పటివరకు షారుఖ్ నటించిన సినిమా రిలీజ్ కాలేదు. మధ్యలో రెండు, మూడు సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసినా.. అవి అభిమానులను సంతృప్తి పరుచలేకపోయాయి.
Pathaan Movie Latest Update | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుండి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళయింది. ‘జీరో’ తర్వాత ఇప్పటివరకు షారుఖ్ నటించిన సినిమా రిలీజ్ కాలేదు. మధ్యలో రెండు, మూడు సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసినా.. అవి అభిమానులను సంతృప్తి పరుచలేకపోయాయి. ప్రస్తుతం ఈయన సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక షారుఖ్ ఈ నాలుగేళ్ళ గ్యాప్‌ను పూర్తి చేసేందుకు వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘పఠాన్’ ఒకటి. ఈ చిత్రాన్ని ‘వార్’ ఫేం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన షారుఖ్ పోస్టర్స్ సినిమా పైన భారీ అంచనాలను పెంచుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సినిమా టీజర్‌కు సంబంధించిన డేట్ నెట్టింట వైరల్‌గా మారింది. పఠాన్ టీజర్‌ను షారుఖ్ బర్త్‌డే సంబర్భంగా నవంబర్ 2న రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్ అబ్రహం, దీపికా పదుకొనే కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ చిత్రం యష్‌రాజ్ ఫిలింస్ సంస్థలో 50వ సినిమా కావడం విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్ కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

