Varasudu Movie | టాప్ మ్యూజిక్ సంస్థకు ‘వారసుడు’ ఆడియో రైట్స్.. ఎన్ని కోట్లో తెలుసా?
Varasudu Movie Audio Rights | తమిళ హీరో విజయ్ తెలుగులో మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో నేరుగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో చేతులు కలిపాడు. ఈ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం 'వారసుడు'.
Varasudu Movie Audio Rights | తమిళ హీరో విజయ్ తెలుగులో మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో నేరుగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో చేతులు కలిపాడు. ఈ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘వారసుడు’. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే చిత్రబృందం రిలీజ్ చేసిన పోస్టర్లు, వర్కింగ్ స్టిల్స్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం వరుసగా అప్డేట్లను ప్రకటిస్తుంది. కాగా తాజాగా మరో క్రేజీ అప్డేట్ ప్రకటించింది.
ఈ సినిమా ఆడియో రైట్స్‌కు సంబంధించిన అప్డేట్ను చిత్రబృందం ప్రకటించింది. వారసుడు సినిమా ఆడియో హక్కులను టీ-సిరీస్ దక్కించుకున్నట్లు వెల్లడించింది. కాగా ఈ సినిమా తెలుగు, తమిళ ఆడియో రైట్స్ కోసం ‘టీ-సిరీస్’ దాదాపు రూ.10 కోట్లు చెల్లించినట్లు తెలుస్తుంది. పైగా ఇప్పుడు థమన్ మ్యూజిక్కు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. తమిళంలో అత్యధిక రేటుకు అమ్ముడైన టాప్-5 మ్యూజిక్ ఆల్బమ్‌లలో ‘వారసుడు’ ఆల్బమ్ ఒకటిగా నిలిచినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇక ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి బృందావనం స్టైల్లో యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.
Happy to be associated with @TSeries to bring the music of #Varisu to you 🎵#Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman #BhushanKumar #VarisuPongal pic.twitter.com/nHmn8OB97V
— Sri Venkateswara Creations (@SVC_official) October 29, 2022
Read Also:
Rajinikanth | ఆ అగ్ర నిర్మాణ సంస్థతో రజనీకాంత్ భారీ డీల్?
Balakrishna | చిరు రిజెక్ట్ చేసిన దర్శకుడికి.. బాలకృష్ణ చాన్స్ ఇచ్చాడా?
Pathaan Movie | ‘పఠాన్’ మూవీ క్రేజీ అప్డేట్.. షారుఖ్ ఫ్యాన్స్‌కు పండగే..!
Rishab Shetty | రిషబ్‌శెట్టిని సత్కరించిన సూపర్‌స్టార్.. ‘కాంతార’ హీరో ట్వీట్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ప్రజల కష్టాలు తొలగి, సర్వ సంపదలు చేకూరాలి..రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

