Rajinikanth | ఆ అగ్ర నిర్మాణ సంస్థతో రజనీకాంత్ భారీ డీల్?
Rajinikanth Next Movies | వయసుతో సంబంధంలేకుండా రజనీకాంత్ ప్రస్తుతం వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఏడు పదుల వయసు దాటినా యంగ్ హీరోలకు పోటీగా యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా రజనీకాంత్‌ను ఫ్లాప్‌లు వెంబటిస్తున్నాయి.
Rajinikanth Next Movies | వయసుతో సంబంధంలేకుండా రజనీకాంత్ ప్రస్తుతం వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఏడు పదుల వయసు దాటినా యంగ్ హీరోలకు పోటీగా యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా రజనీకాంత్‌ను ఫ్లాప్‌లు వెంబటిస్తున్నాయి. నిజానికి ‘రోబో’ తర్వాత ఇప్పటి వరకు రజనీకి ఆ స్థాయి హిట్టు లేదు. ప్రస్తుతం ఈయన నెల్సన్ కుమార్‌తో ‘జైలర్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇదిలా ఉంటే రజనీకాంత్ తాజాగా మరో రెండు సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్ళడానికి సిద్ధమయ్యాడు.
రజనీకాంత్ తాజాగా లైకా ప్రొడక్షన్ సంస్థలో రెండు సినిమాలకు సైన్ చేశాడు. ఇక ఈ రెండు సినిమాల పూజా కార్యక్రమాలు నవంబర్ 4న చెన్నైలో జరుగనున్నాయి. అందులో ఒక చిత్రాన్ని ‘డాన్’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన సిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నాడు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అరవింద్ స్వామి ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నాడు. మరో చిత్రాన్ని ‘కనులు కనులు దోచాయంటే’ ఫేమ్ దేశింగ్ పెరియసామి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్నట్లు టాక్.
https://twitter.com/baraju_SuperHit/status/1585967102028308481?s=20&t=yQndikC2ks3b6J1SUh_-Dw
Read Also:
ప్రభాస్‌కు మూడో హీరోయిన్ దొరికేసింది.. ఈ సారి ఏకంగా కన్నడ భామనే లైన్లో పెట్టేశారు..!
Varsha Bollamma | బడా నిర్మాత కొడుకును పెళ్ళి చేసుకోబోతున్న వర్ష బొల్లమ్మ?
Mahesh Babu | సూపర్‌స్టార్ అరుదైన ఘనత.. సౌత్‌లో నెం.1 హీరోగా సరికొత్త రికార్డు
‘Thalapathy67’లో విజయ్ గ్యాంగ్‌స్టార్‌గా కనిపించనున్నాడా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

